
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురిని ప్రేమించాడని అమ్మాయి తరపు బంధువులు మహేశ్ అనే యువకుడిపై దాడి చేశారు. 25 రోజుల క్రితం జరిగిన ఈ దాడిలో మహేశ్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్‌పూర్ గ్రామంకు చెందిన మహేశ్.. అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు 25 రోజుల క్రితం మహేశ్‌పై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహేశ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. యువతి తరుపు బంధువులు కొట్టడంతోనే తన కుమారుడు మృతి చెందారని మహేశ్ తల్లి ఆరోపించారు. మహేశ్ మృతికి కారణమైన యువతి బంధువులను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment