Nandipeta
-
నిజామాబాద్‌లో దారుణం
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తమ కూతురిని ప్రేమించాడని అమ్మాయి తరపు బంధువులు మహేశ్ అనే యువకుడిపై దాడి చేశారు. 25 రోజుల క్రితం జరిగిన ఈ దాడిలో మహేశ్ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం కౌల్పూర్ గ్రామంకు చెందిన మహేశ్.. అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు 25 రోజుల క్రితం మహేశ్‌పై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన మహేశ్.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. యువతి తరుపు బంధువులు కొట్టడంతోనే తన కుమారుడు మృతి చెందారని మహేశ్ తల్లి ఆరోపించారు. మహేశ్ మృతికి కారణమైన యువతి బంధువులను అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. -
బాల్యానికి రక్షణ ఏది?
నందిపేట (నిజామాబాద్ జిల్లా) : అందరిలాగే చదువుకోవాలని తలంచినది ఆ బాలిక. తల్లి ప్రేమకు నోచుకోలేదు. తండ్రి చూపిన బిక్షాటన మార్గంలో తగినంత అడుక్కురాలేక పోతోంది. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన కన్న తండ్రి కాలయముడిగా మారి గదిలో బంధించి కట్టేసి చితకబాదాడు. పదేళ్ల ఆ బాలిక ఒళ్లంతా గాయాలవడమేకాక కాళ్లు చేతులు విరిగిపోయాయి. నిజామాబాద్ జిల్లా నందిపేటలో శనివారం జరిగిన ఈ ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి . నిజామాబాద్ మండలం తిర్మన్‌పల్లికి చెందిన కోట ఎల్లప్ప కొంత కాలం క్రితం బతుకు దెరువు కోసం ఇద్దరు కూతుర్లను వెంట తీసుకుని నందిపేట వచ్చాడు. వీరు వృత్తిరీత్యా బుగ్గల వ్యాపారులు. ఎల్లప్ప తన భార్యను చంపిన ఘటనలో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే తిరిగి వచ్చాడు. వచ్చిన నాటి నుండి ఇద్దరు కూతుర్లను బిక్షటనకు పంపిస్తున్నాడు. ప్రతి రోజు ఇద్దరు కూతుర్లు బిక్షాటన చేసిన డబ్బులు తండ్రికి తెచ్చి ఇవ్వాలి. శనివారం చిన్న కూతురు బడ్డెవ్వ సరిపడా డబ్బులు తీసుకురాలేదు. తప్ప తాగిన తండ్రి ఆగ్రహాంతో ఊగిపోతూ బాలికను గదిలో బంధించి, కిటికీకి కట్టేసి కొట్టాడు. దీంతో ఒడ్డెవ్వకు తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. కుడి చేయి, కాలు విరిగి పోయి నిస్సహాయ స్థితిలో పడిపోయింది. చుట్టుపక్కలవారు ఈ విషయం తెలుసుకుని, బాలికను రక్షించి అంబులెన్సుకు సమాచారం అందించారు. ఎల్లప్ప వారితోనూ గొడవకు దిగే ప్రయత్నం చేశాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఎల్లప్పను అదుపులోకి తీసుకున్నారు. గామపడిన బాలికను ఆస్పత్రికి తరలించారు. తండ్రి విచక్షణా రహిత చర్యకు సహాయ పడిన పెద్దకూతురు పోసాని పరారయింది. -
కలల వారధి సాకారమవుతుందా?
నందిపేట: నందిపేట మండలం ఉమ్మెడ శివారులో గోదావరి నదిపై వంతెన నిర్మించే విషయంపై ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణం తరువాత అదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలతో మన జిల్లాలోని నందిపేట మండలానికి సంబంధాలు తెగిపోయాయి. వీటిని పునరుద్ధరించడానికి గోదావరి నదిపై వంతెనను నిర్మించాలని పరివాహక గ్రామాల ప్రజలు ఎంతో కాలంగా కోరుతూ వస్తున్నారు. స్థానిక నాయకులు కూడా అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా, గత ప్రభుత్వాలు ఈ వి షయాన్ని పట్టించుకోలేదు. ఈ క్రమంలో రెండు జిల్లాలను అనుసంధానం చేస్తూ వంతెన నిర్మాణం చేపడతామని సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అదిలాబాద్ జిల్లా నిర్మల్‌లో జరిగిన బహిరంగసభలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం ఆదేశాల మేరకు అదిలాబాద్ జిల్లా అధికారులు ప్రతిపాదనలు సిద్ధ ం చేసి పంపించారు. దీంతో గోదావరి పరీవాహక ప్రాంతాల గ్రామాలలో ఆనందం వ్యక్తమవుతోంది. తెప్పలపైనే ప్రయాణం నందిపేట మండలంలోని పలు గ్రామాలకు అదిలాబాద్ జిల్లా లోకేశ్వరం, దిలావర్పూర్, ముథోల్, కుంటాల, భైంసా మండలాలతోపాటు మహారాష్ట్రలోని కిన్వట్ మండలాల ప్రజలకు సంబంధాలు ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ నిర్మాణం చేపట్టడంతో 50 ఏళ్ల నుంచి ఈ ప్రాంతాల మధ్య తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ వైపు నుంచి అవతలి వైపునకు వెళ్లాలంటే వ్యయప్రయాసలకోర్చి దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. వేసవికాలంలో మాత్రం నదిలో నీటి ఉధృతి తగ్గడంతో మండ లంలోని ఉమ్మెడ, బాద్గుణ గ్రామాల వద్ద గల రేవుల నుంచి తెప్పలపై సుమారు రెండు కిలోమీటర్లు ప్రయాణించి అవతలి గ్రామాలకు చేరుతున్నారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఉమ్మెడ-పంచగూడ గ్రామాల మధ్య వంతెనను నిర్మించేందుకు అదిలాబాద్ జిల్లా అధికారులు నదికిరుపక్కల సర్వే జరిపారు. 78 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపారు. నదిలో సుమారు 600 మీటర్ల మేర వంతెన నిర్మించాల్సి ఉంటుందని అధికారులు చెపుతున్నారు. వంతెనకు ఇరుపక్కల రెండు కిలో మీటర్లు మేర అనుసంధాన రోడ్డు వేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ భూములు ఉన్నందున భూసేకరణ సమస్యలేదని పేర్కొంటున్నారు. ప్రభుత్వ ఆమోద ముద్ర పడిన వెంటనే అంచనాలు తయారు చేస్తామని చెబుతున్నారు. పలువురి ఆందోళనలు అన్నారం-గడిచంద గ్రామాల వంతెన నందిపేట మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అన్నారం వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సుమారు 800 మీటర్ల వరకు వంతెన నిర్మించాల్సి ఉంటుంది. బ్రిడ్జికి ఇరువైపులా నిర్మించే అనుసంధాన రదారి దూరం కూడా పెరుగుతుంది. అదిలాబాద్ జిల్లాలోని గ్రామాలకు వెళ్లేందుకు అదనంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. నిర్మాణ వ్యయం సైతం అధికమవుతుంది. అన్నారం వద్ద వంతెన నిర్మాణం చేపట్టేందుకు నిజామాబాద్ జిల్లా అధికారులతో ప్రతిపాదనలు తయారుచేసేందుకు నాయకులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తమ గ్రామాల వద్ద వంతెన నిర్మాణం చే పట్టాలని ఉమ్మె డ, అన్నారం గ్రామాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలవారు నాయకులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. -
రైతుల రుణాలను మాఫీ చేయాలి
నందిపేట : తెలంగాణ రాష్ట్రం లో రైతులు తీసుకున్న లక్ష రూపాయల లోపు రుణాలను వెంటనే మాఫీ చేస్తూ జీఓను విడుదల చేయాలని తెలంగాణ రాష్ర్ట రైతు సంఘం అధ్యక్షుడు విశ్వేశ్వర రావు డిమాండ్ చేశారు. మంగళవారం మం డల కేంద్రంలో తెలంగాణ రా ష్ట్ర రైతు సంఘం జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ అధ్యక్షతన నిర్వహిం చారు. ఈ సమావేశానికి హాజరైన విశ్వేశ్వర రావు మాట్లాడుతూ.. రైతుల రుణాలను మాఫీ చేస్తామని చెప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె నెక్కిన తర్వాత రిజర్వ్ బ్యాంకును సాకుగా చూపి తప్పించుకోవాలని చూ స్తోందని విమర్శించారు. గతేడాది ఆగస్టులో నష్టపోయిన రైతాంగానికి ఇన్పుట్ సబ్సి డీ కింద నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని బోధన్ పట్టణ శివారులో గల శ్రీబాలాజీ రైస్‌మి ల్లు నుంచి దుమ్ము,ధూళీ వెలువడడం వల్ల చుట్టు పక్కల ఉన్న పంటపొలాలు దెబ్బతింటున్నాయన్నారు. తద్వా రా చిన్న, సన్నకారు రైతు తీవ్రంగా నష్ట పోతున్నారన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో నాయకులు పశ్య పద్మ, కంజర భూమయ్య, శేఖర్‌బాబు, శంకర్, షేక్ బాబు, సుధాకర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. -
రూ. లక్షల్లో పట్టుబడుతున్న నగదు
నందిపేట, న్యూస్‌లైన్:నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామ చౌరస్తా వద్ద ఎన్నికలలో భాగంగా చేపట్టిన తనిఖీలలో రూ.2 లక్షల నగ దు, 54 క్వాటరు సీసాల మద్యాన్ని గురువారం అధికారులు పట్టుకున్నారు. నందిపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టగా చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద రూ.2 లక్షల నగదు లభించాయి. డబ్బులకు సంబంధించి ఆ వ్యక్తి సరైన ఆధారాలు చూ పించక పోవడంతో నగదును స్వాధీనం చేసుకుని ఆర్మూర్‌లోని రిటర్నింగ్ అధికారి జె.గజ్జెన్నకు అందజేశారు. అలాగే బస్సులో 39 రాయల్ లైఫ్, 15 ఆఫీసర్ చాయిస్ క్వాటరు సీసాలను అధికారులు పట్టుకున్నారు. మామిడిపల్లి వద్ద రూ 1.50 లక్షలు.. ఆర్మూర్ అర్బన్ : మండలంలోని మామిడిపల్లి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.50 లక్షల నగదును పోలీసులు గురువారం జప్తు చేశారు. ఆర్మూర్ ప్రాంతం ఎర్రజొన్న ధాన్యాన్ని లారీల్లో ఢిల్లీ తరలించడానికి ఉమేష్ పాటిల్ అనే వ్యక్తి ఆర్మూర్ వచ్చాడు. ఈ క్రమంలో రూ. 9 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి వాహనాల్లో డీజిల్ పోయించేందుకు అడ్వాన్సులుగా ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మిగిలిన రూ. 1.50 లక్షల నగదును మామిడిపల్లిలో తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. డబ్బుఆధారాలు లేకపోవడంతో జప్తు చేశారు. చిట్టాపూర్ శివారులో 3.90 లక్షలు.. బాల్కొండ: మండలంలోని చిట్టాపూర్ శివారులో జాతీ య రహదారి-44పై ఎన్నికల ఎస్ఎస్టీ టీం 39, ఫ్లైయిం గ్ టీం డీసీఎం వ్యానులో రూ. 3.90 లక్షల నగదును గురువారం పట్టుకున్నట్లు తహశీల్దార్ పండరినాథ్ తెలిపారు. దత్తాద్రి అనే వ్యక్తి డబ్బులు తీసుకుపోతుండగా ఎలాంటి ఆధారాలు చూపించక పోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఎస్ఎస్టీ సమాద్, డిప్యూటీ తహశీల్దార్ వేణుగౌడ్, ఎంఆర్ఐ సుజాత తనీఖీల్లో పాల్గొన్నారు. లింగంపేటలో రూ. 11.16 లక్షలు.. లింగంపేట: లింగంపేట సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద గురువారం రాత్రి చేపట్టిన తనిఖీలలో రూ.11.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ఫ్లయింగ్‌స్వ్కాడ్ అధికారి అలెగ్జాండర్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పీటర్ తెలిపారు. పిట్లం నుంచి కామారెడ్డికి వెళ్తున్న వాణి నవశక్తి బీడీ కంపనీ సిబ్బంది డబ్బును తరలిస్తుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ సిబ్బం దికి పట్టుబడ్డారు. స్వాధీనం చేసుకున్న డబ్బును సీజ్‌చేసి ఆర్డీఓ కార్యాలయానికి తరలిస్తామని అలెగ్జాండర్ తెలిపారు. కామారెడ్డిలో రూ.2 లక్షలు... కామారెడ్డి : కామారెడ్డిలో సిరిసిల్లా రహదారిపై పట్టణ శివారులో గురువారం రాత్రి ఓ వ్యక్తి వద్ద నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ రూ. 2 లక్షల స్వాధీనం చేసుకున్నారు. కె.గణేశ్ అనే వ్యక్తి వద్ద రూ. 2 లక్షలు ఉండగా వాటికి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ నాగరాజ్ గౌడ్, ముఖేశ్ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. పోచారం చెక్‌పోస్టు వద్ద 60 వేలు.. నాగిరెడ్డిపేట : మండలంలోని పోచారం చెక్‌పోస్టు వద్ద గురువారం వాహనాల తనిఖీల్లో 60 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా అంధోల్ మండలం చింతకుంటకు చెందిన అంబటి హన్మంత్‌రెడ్డి ఇండికా కారులో జోగిపేటకు వెళ్తుండగా పోచారం చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారులో 60 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు ఆధారాలు చూపించక పోవడంతో అధికారులు సీజ్ చేశారు. యంచ సమీపంలో రూ. 20,35,210 స్వాధీనం నవీపేట : నవీపేట మండలంలోని యంచ గ్రామ సమీపంలో గల గోదావరి బ్రిడ్జి దగ్గర గురువారం వాహనాల ను తనిఖీ చేస్తుండగా 20 లక్షల 35వేల 210 నగదును పట్టుకున్నారు. కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన పత్తి వ్యాపారులు నాందేడ్‌లో పత్తిని విక్రయించ గా వచ్చిన డబ్బులను తీసుకుని వేర్వేరు వాహనాలలో వస్తుండగా సరిహద్దు ప్రాంతంలో తనిఖీ బృందం ఈ నగదును స్వాధీనం చేసుకుంది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను తీసుకుని వస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటు ఓచర్లు చూపించారు.కానీ నియమని బంధన ల ప్రకారం ఆ నగదును తనిఖీ బృందం స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించారు. నల్గొండ జిల్లా గుర్రంపూడకు చెందిన వ్యాపారి మల్లారెడ్డి వద్ద 2,91,000,మెదక్ జిల్లాలోని గజ్వేల్‌కు చెందిన ఆంజనేయులు దగ్గర 6,25,810,అదే జిల్లాలోని తొవ్వాటకు చెందిన బాల్ నర్సయ్య దగ్గర 2,90,000,కరీంనగర్ జిల్లాలోని వేములవాడకు చెందిన మహేష్ దగ్గర 8,28,400 లభ్యమైనట్లు తహశీల్దార్ మహబూబ్ అలీ తెలిపారు.తనిఖీలో నీటి పారుదల శాఖ ఏఈ రషీద్, డీటీ రమేష్,గిర్దావర్ శ్రీనివాస్,కానిస్టేబుల్ మహబూబ్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు. -
క్యాన్సర్ సోకింది.. కాపాడండి
నందిపేట, న్యూస్‌లైన్: ఆ మాతృమూర్తిని కష్టాలు వెంటాడుతున్నాయి.. ఐదు నెలల క్రితం భర్త గుండెపోటుతో మృతి చెం దాడు. అప్పటికే మాయదారి క్యాన్సర్ రోగం బారినపడ్డ ఆ ఇల్లాలు భర్త మృతిని తట్టుకోలేకపోయింది. తాను బతికే రోజులను వేళ్లపై లెక్కేసుకుంటున్న సమయంలో భర్త మృతి చెందడం ఆ కటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. ఏడాదిగా ఆరోగ్యం క్షీణించి పని చేయడానికి శరీరం సహకరించకపోవడంతో సంసాదన కరువైంది. దీంతో మందులకు డబ్బుల్లేక నానాటికీ ఆరోగ్యం విషమిస్తోంది. ఒకపక్క వృద్ధ తల్లిదండ్రులు, మరోపక్క ఒక్కగానొక్క కూతురు. ఆమె భవిష్యత్ ఏమవుతుందోనని ఆలోచించి ఆ ఇల్లాలికి కంటనీరే కరువయ్యింది. వివరాలు.. నందిపేట మండలం సిర్పూర్ గ్రామానికి చెందిన పెంటల సత్యగంగుకు మాక్లూర్ మండలం అమ్రాద్ గ్రామానికి చెందిన బాజన్నతో వివాహం జరిగింది. బాజన్న 20 ఏళ్ల క్రితం ఇల్లరికం వచ్చాడు. భర్త చేపలు పట్టగా వచ్చే డబ్బుతోపాటు తాను బీడీలు చుట్టగా వచ్చే సంపాదనతో జీవిం చేవారు. వీరికి సుపర్ణ అనే కూతురుతోపాటు వృద్ధ తల్లిదండ్రులు ఉన్నారు. ప్రస్తుతం సువర్ణ డొంకేశ్వర్ జెడ్పీహెచ్ఎస్లో ఆరో తరగతి చదువుతోంది. ఈక్రమంలో ఏడాది క్రితం విధి ఆ పేద కుటుంబంపై కన్నెర్రజేసిం ది. గొంతులో నలతగా ఉండదని ఆస్పత్రికి వెళ్లిన సత్యగంగుకు గొంతు క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. పొట్టగడవడమే కష్టంగా ఉన్న కుటుంబానికి విలువైన మందులు కొనే స్థోమత లేదు. చికిత్స కోసం లక్ష రూపాయల వరకు అప్పు చేశారు. అప్పటికే రోగం ముదిరిపోయింది. ఫలితంగా 40 ఏళ్లకే వృద్ధురాలిగా మారిపోయింది. ఆరోగ్యశ్రీలో ఇచ్చే మందులు వాడితే గొంతులో పగుళ్లు వస్తున్నాయని, అందుకే వాటిని వాడడంలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో విధి ఆమెపై మరోసారి కక్ష తీర్చుకుంది. ఐదు నెలల క్రితం గుండెపోటుతో ఆమెభర్త బాజన్న మృతి చెందాడు. దీంతో పనిచేసేవారు లేక ఆరు నెలలుగా పొట్టగడవడమే కష్టంగా మారింది. ‘ప్రైవేటు ఆస్పత్రిలో ఇస్తున్న మందులు వాడితే ఆ పూటకు ఉపశమనం లభిస్తోంది. కానీ డబ్బుల్లేక నెల రోజులుగా వాటిని వాడడం లేదు. దీంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. అన్నం తినడం మానేసి చాలా రోజులైంది.’ అని సత్యగంగు చెబుతూ కన్నీటి పర్యంతమవుతోంది. తమ తాహతుకు మించి చికిత్స కోసం చేసిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పులు ఇచ్చిన వారు ఇంటిచుట్టూ తిరుగుతున్నారని, తాను బతికుండగానే తన వృద్ధ తల్లిదండ్రులు, కన్నకూతురు పస్తులుంటున్నారని కంటతడి పెట్టుకుంది. బతికి ఉన్నన్ని రోజులు దయార్థ హృదయులు ఎవరైనా సహాయం చేయాలని, కనీసం ఒక్కపూట భోజనం చేసేందుకైనా తమ కుటుంబాన్ని మంచి మనసుతో ఆదుకోవాలని సత్యగంగు దాతలను వేడుకుంటుంది. -
గల్ఫ్ బాధితులను పట్టించుకోండి
నందిపేట, న్యూస్‌లైన్ :గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే బాధితులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులను దిగ్బంధిస్తామని స్వదేశీజాగరణ మంచ్ కేంద్ర కమిటీ సభ్యుడు కోటపాటి నరసింహానాయుడు స్పష్టం చేశారు. బుధవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. గల్ఫ్ బాధితుల గర్జన పేరుతో ఈనెల 8న ఆర్మూర్‌లో జరిగిన సభ విజయవంతమైందన్నారు. అయినప్పటికీ బాధితుల ప్రధాన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. గల్ఫ్ బాధితుల కోసం రెండు వేల కోట్ల రూపాయలతో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఏజెంట్ల వ్యవ స్థను రద్దుచేసి విదేశాల్లో ఉద్యోగాలు ఉంటే ప్రభుత్వ సంస్థ ద్వారా నియామకాలు చేపట్టాలని కోరారు. పావలావడ్డీకి రుణాలు ఇస్తే వారు కొంతవరకైనా కోలుకోవడానికి ఆస్కారముంటుందన్నారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో ‘గల్ఫ్ బాధిత పోరాట సమితి’పేరుతో కమిటీలు వేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా జిల్లాలోనే మొట్టమొదట నందిపేట మండలం ఉమ్మెడ గ్రామంలో కమిటీని వేసినట్లు తెలిపారు.