రూ. లక్షల్లో పట్టుబడుతున్న నగదు | lakhs of money caught by police | Sakshi
Sakshi News home page

రూ. లక్షల్లో పట్టుబడుతున్న నగదు

Published Fri, Mar 14 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

రూ. లక్షల్లో పట్టుబడుతున్న నగదు

రూ. లక్షల్లో పట్టుబడుతున్న నగదు

నందిపేట, న్యూస్‌లైన్:నందిపేట మండలంలోని వెల్మల్ గ్రామ చౌరస్తా వద్ద ఎన్నికలలో భాగంగా చేపట్టిన తనిఖీలలో రూ.2 లక్షల నగ దు, 54 క్వాటరు సీసాల మద్యాన్ని గురువారం అధికారులు పట్టుకున్నారు. నందిపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టగా చంద్రశేఖర్ అనే వ్యక్తి వద్ద రూ.2 లక్షల నగదు లభించాయి. డబ్బులకు సంబంధించి ఆ వ్యక్తి సరైన ఆధారాలు చూ పించక పోవడంతో నగదును స్వాధీనం చేసుకుని ఆర్మూర్‌లోని రిటర్నింగ్ అధికారి జె.గజ్జెన్నకు అందజేశారు. అలాగే బస్సులో 39 రాయల్ లైఫ్, 15 ఆఫీసర్ చాయిస్ క్వాటరు సీసాలను అధికారులు పట్టుకున్నారు.

 మామిడిపల్లి వద్ద రూ 1.50 లక్షలు..
 ఆర్మూర్ అర్బన్ : మండలంలోని మామిడిపల్లి వద్ద ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ.1.50 లక్షల నగదును పోలీసులు గురువారం జప్తు చేశారు. ఆర్మూర్ ప్రాంతం   ఎర్రజొన్న ధాన్యాన్ని లారీల్లో ఢిల్లీ తరలించడానికి ఉమేష్ పాటిల్ అనే వ్యక్తి ఆర్మూర్ వచ్చాడు. ఈ క్రమంలో రూ. 9 లక్షలను బ్యాంకు నుంచి డ్రా చేసి వాహనాల్లో డీజిల్ పోయించేందుకు అడ్వాన్సులుగా ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మిగిలిన రూ. 1.50 లక్షల నగదును మామిడిపల్లిలో తనిఖీల్లో పోలీసులు పట్టుకున్నారు. డబ్బుఆధారాలు లేకపోవడంతో జప్తు చేశారు.  
 
చిట్టాపూర్ శివారులో 3.90 లక్షలు..
 బాల్కొండ:  మండలంలోని చిట్టాపూర్ శివారులో జాతీ య రహదారి-44పై ఎన్నికల ఎస్‌ఎస్‌టీ టీం 39, ఫ్లైయిం గ్ టీం డీసీఎం వ్యానులో రూ. 3.90 లక్షల నగదును గురువారం పట్టుకున్నట్లు తహశీల్దార్ పండరినాథ్ తెలిపారు. దత్తాద్రి అనే వ్యక్తి  డబ్బులు తీసుకుపోతుండగా ఎలాంటి ఆధారాలు చూపించక పోవడంతో సీజ్ చేసినట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌టీ సమాద్, డిప్యూటీ తహశీల్దార్ వేణుగౌడ్, ఎంఆర్‌ఐ సుజాత తనీఖీల్లో పాల్గొన్నారు.
 
లింగంపేటలో రూ. 11.16 లక్షలు..
లింగంపేట:  లింగంపేట సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద గురువారం రాత్రి చేపట్టిన తనిఖీలలో రూ.11.16 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల ఫ్లయింగ్‌స్వ్కాడ్ అధికారి అలెగ్జాండర్, పోలీస్ హెడ్ కానిస్టేబుల్ పీటర్ తెలిపారు. పిట్లం నుంచి కామారెడ్డికి వెళ్తున్న వాణి నవశక్తి బీడీ కంపనీ సిబ్బంది డబ్బును తరలిస్తుండగా ఫ్లయింగ్ స్వ్కాడ్ సిబ్బం దికి పట్టుబడ్డారు.  స్వాధీనం చేసుకున్న డబ్బును సీజ్‌చేసి ఆర్డీఓ కార్యాలయానికి తరలిస్తామని అలెగ్జాండర్ తెలిపారు.
 
కామారెడ్డిలో రూ.2 లక్షలు...
కామారెడ్డి : కామారెడ్డిలో సిరిసిల్లా రహదారిపై పట్టణ శివారులో గురువారం రాత్రి ఓ వ్యక్తి వద్ద నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ రూ. 2 లక్షల స్వాధీనం చేసుకున్నారు.   కె.గణేశ్ అనే వ్యక్తి వద్ద రూ. 2 లక్షలు ఉండగా వాటికి ఎలాంటి ఆధారాలు చూపకపోవడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ నాగరాజ్ గౌడ్, ముఖేశ్ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
 
పోచారం చెక్‌పోస్టు వద్ద 60 వేలు..
 నాగిరెడ్డిపేట : మండలంలోని పోచారం చెక్‌పోస్టు వద్ద గురువారం వాహనాల తనిఖీల్లో 60 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా అంధోల్ మండలం చింతకుంటకు చెందిన అంబటి హన్మంత్‌రెడ్డి ఇండికా కారులో జోగిపేటకు వెళ్తుండగా పోచారం చెక్‌పోస్టు వద్ద పోలీసులు కారులో 60 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బుకు ఆధారాలు చూపించక పోవడంతో అధికారులు సీజ్ చేశారు.
 
యంచ సమీపంలో రూ. 20,35,210 స్వాధీనం
 నవీపేట : నవీపేట మండలంలోని యంచ గ్రామ సమీపంలో గల గోదావరి బ్రిడ్జి దగ్గర గురువారం వాహనాల ను తనిఖీ చేస్తుండగా 20 లక్షల 35వేల 210 నగదును పట్టుకున్నారు. కరీంనగర్, నల్గొండ, మెదక్ జిల్లాలకు చెందిన పత్తి వ్యాపారులు నాందేడ్‌లో పత్తిని విక్రయించ గా వచ్చిన డబ్బులను తీసుకుని వేర్వేరు  వాహనాలలో వస్తుండగా సరిహద్దు ప్రాంతంలో తనిఖీ బృందం ఈ నగదును స్వాధీనం చేసుకుంది. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను తీసుకుని వస్తున్నట్లు వ్యాపారులు పేర్కొంటు ఓచర్లు చూపించారు.కానీ నియమని బంధన ల ప్రకారం ఆ నగదును తనిఖీ బృందం స్వాధీనం చేసుకుని ఐటీ అధికారులకు అప్పగించారు.
నల్గొండ జిల్లా గుర్రంపూడకు చెందిన వ్యాపారి మల్లారెడ్డి వద్ద 2,91,000,మెదక్ జిల్లాలోని గజ్వేల్‌కు చెందిన ఆంజనేయులు దగ్గర 6,25,810,అదే జిల్లాలోని తొవ్వాటకు చెందిన బాల్ నర్సయ్య దగ్గర 2,90,000,కరీంనగర్ జిల్లాలోని వేములవాడకు చెందిన మహేష్ దగ్గర 8,28,400 లభ్యమైనట్లు తహశీల్దార్ మహబూబ్ అలీ తెలిపారు.తనిఖీలో నీటి పారుదల శాఖ ఏఈ రషీద్, డీటీ రమేష్,గిర్దావర్ శ్రీనివాస్,కానిస్టేబుల్ మహబూబ్ పాల్గొన్నట్లు పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement