సాక్షి, హైదరాబాద్: అమెరికన్ మైనర్‌ను వేధిస్తున్న నిజామాబాద్‌కు చెందిన యువకున్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకెళ్తే.. నిజామాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ చదువుతున్న సందీప్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో యువతులకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపి వారితో ప్రొఫెషనల్ చాటింగ్ చేస్తుండేవాడు. అదే కోవలో అమెరికన్ మైనర్‌తో మాటలు కలిపి మభ్యపెట్టి అభ్యంతరకర ఫోటోలను సేకరించాడు. అనంతరం న్యూడ్ ఫోటోలు పంపాలని సందీప్ బ్లాక్ మెయిల్‌కు దిగాడు. (చనువుగా ఉన్నప్పుడు ఫొటోలు తీసి బ్లాక్‌మెయిల్)
ఆ తర్వాత తను అడిగినంత ఇవ్వకపోతే న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ బాలిక ఇన్‌స్టాగ్రామ్‌లో అతడిని బ్లాక్ చేయడంతో న్యూడ్ ఫోటోలను స్నేహితులకు పంపాడు. దీంతో భయపడిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకొని, దర్యాప్తును ముమ్మరం చేశారు. (బొల్లినేని శ్రీనివాస గాంధీపై సీబీఐ కేసు నమోదు)
Comments
Please login to add a commentAdd a comment