
శంషాబాద్: మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు నమ్మించి మోసం చేసిన సంఘటన ఆర్‌జీఐఏ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. సదరు బాలిక సోమవారం అర్ధరాత్రి నుంచి అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆర్‌జీఐఏ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కొత్వాల్‌గూడకు చెందిన మైనర్ బాలిక(17)ను ఎయిర్‌పోర్టు కాలనీకి చెందిన విజయ్(25) ప్రేమ పేరుతో నమ్మించి గర్భవతిని చేశాడు. సదరు బాలికకు తెలియకుండానే ఇటీవలే మరో వివాహం కూడా చేసుకున్నాడు.
కాగా సోమవారం అర్ధరాత్రి నుంచి బాలిక అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు, మాలల ఐక్యవేదిక సంఘం గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు అనిత మంగళవారం ఉదయం ఆర్‌జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయమై మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్లు మాలల ఐక్యవేదిక గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు అనిత పేర్కొన్నారు. మైనర్ బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఆర్‌జీఐఏ సీఐ విజయ్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment