దారుణం: ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం | Young Man Molestation Attempt On Six Year Girl In Chittoor District | Sakshi
Sakshi News home page

దారుణం: ఆరేళ్ల బాలికపై అత్యాచార యత్నం

Published Wed, Jul 7 2021 7:10 PM | Last Updated on Wed, Jul 7 2021 7:15 PM

Young Man Molestation Attempt On Six Year Girl In Chittoor District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చిత్తూరు: చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ దారుణ ఘటన బైరెడ్డిపల్లి మండలం చిన్నపురంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరేళ్ల బాలికపై అదే బైరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ధనుంజయరెడ్డి అనే యువకుడు అత్యాచారం యత్నించాడు. ఇంటి వద్ద ఆడుకుంటున్న చిన్నారిని పశువుల కొట్టంలోకి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావటంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. ఆ బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement