డబ్బున్న యువతులే టార్గెట్‌ | Young Man Targets Rich Girls And Blackmail Karnataka | Sakshi
Sakshi News home page

డబ్బున్న యువతులే టార్గెట్‌

Published Wed, Aug 19 2020 7:39 AM | Last Updated on Wed, Aug 19 2020 7:39 AM

Young Man Targets Rich Girls And Blackmail Karnataka - Sakshi

సుహాన్‌ హరిప్రసాద్‌

బొమ్మనహళ్లి: సంపన్న యువతులను టార్గెట్‌ చేసి తాను విదేశాల్లో ఉన్నత ఉద్యోగం పనిచేస్తున్నట్లు నమ్మించి ప్రేమ, స్నేహం పేరుతో వంచనకు పాల్ప డుతున్న ఉత్తరహళ్లికి చెందిన సుహాన్‌ హరిప్రసాద్‌ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సుహాన్‌ సామాజిక మాధ్యమాల ద్వారా డబ్బున్న యువతులను గుర్తించేవాడు. వారికి రిక్వెస్టులు పంపి తాను విదేశాల్లో ఉన్నానని చెబుతూ విలాసవంతమైన కార్ల ముందు, భవనాల ముందు ఫోటోలు దిగి షేర్‌ చేసేవాడు.

సుహాన్‌ హరిప్రసాద్‌ను అరెస్ట్‌ చేసిన దృశ్యం
అతని మాటలు నమ్మిన వారిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి లక్షల రూపాయల నగదు గుంజేవాడు.   ఇలా అనేక మంది మంది యువతులనుంచి మభ్య పెట్టి నగదు గుంజాడు. అతని చేతిలో మోసపోయి రూ.12లక్షలు సమర్పించుకున్న ఓ బాధితురాలు ఇటీవల బొమ్మనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. ఇతనిపై ఇప్పటివరకు ముగ్గురు యువతులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement