![Young Woman Cheats Hyderabad Advocate As Doctor - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/29/chat.jpg.webp?itok=G_OMr_Mh)
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హిమాయత్‌నగర్: ఇంగ్లండ్‌లో డాక్టర్ (జనరల్ ఫిజీషియన్) అంటూ ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన అడ్వకేట్ రజలి అమృతరావుకు కొద్దిరోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఓ యవతి పరిచమైంది. కొంతకాలం వీరిద్దరూ మెసెంజర్‌లో చాటింగ్ చేసుకుని వాట్సాప్ నంబర్స్‌ను ఎక్సేంజ్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం మరింత ఎక్కువ అయ్యింది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో తాను క్లినిక్ పెడతానని, దానికి సపోర్ట్ కావాలని అమృతరావును కోరింది. ఇందుకు ఆయన అంగీకరించడంతో... ఇంగ్లండ్ నుంచి హైదరాబాద్‌కు వస్తున్నానని చెప్పింది. తనతో పాటు ఖరీదైన గిఫ్ట్‌లను సైతం తీసుకొస్తున్నానని అమృతరావును నమ్మించింది.
మరుసటి రోజు ఢిల్లీ కస్టమ్స్ అధికారులు నన్ను ఆపేశారని, నా వద్ద ఇండియన్ కరెన్సీ లేదని కాల్స్ చేసింది. ఇందుకు అమృతరావు రూ. 2.03 లక్షలను ఆమె ఖాతాకు పంపారు. ఆ తర్వాతా ఇంకా డబ్బులు అవసరమని పదే పదే చెప్పడంతో అనుమానం వచ్చిన అమృతరావు ఆరా తీసేందుకు ప్రయతి్నంచాడు. ఫోన్‌లను స్విచ్చాఫ్ రావడంతో మోసపోయానని గ్రహించి శనివారం సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
చదవండి: రోడ్డు ప్రమాదం: ముగ్గురు యువకుల మృతి
చదవండి: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా.. అది డెంగీ దోమలకు నిలయమే
Comments
Please login to add a commentAdd a comment