ప్రేయసి సోదరుడిని హతమార్చిన యూట్యూబర్‌ | YouTuber With Nearly Million Followers Arrested In Noida Murder Case | Sakshi
Sakshi News home page

బైక్‌స్టంట్లతో ఫేమస్‌; హత్యకేసులో యూట్యూబర్‌ అరెస్టు

Published Tue, Nov 3 2020 9:05 PM | Last Updated on Tue, Nov 3 2020 9:09 PM

YouTuber With Nearly Million Followers Arrested In Noida Murder Case - Sakshi

నిందితుడు నిజాముల్‌ ఖాన్‌

న్యూఢిల్లీ: తన ప్రేమకు అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రేయసి సోదరుడిని హతమార్చాడో యూట్యూబర్‌. స్నేహితులతో కలిసి తన ప్రణాళికను అమలు చేసే క్రమంలో పోలీసుల చేతికి చిక్కాడు. ఈ ఘటన నోయిడాలో చోటుచేసుకుంది. వివరాలు.. అద్భుత బైక్‌స్టంట్లతో ఆకట్టుకునే నిజాముల్‌ ఖాన్‌ తన యూట్యూబ్‌ వీడియోల ద్వారా  పాపులర్‌ అయ్యాడు. 9 లక్షల మందికిపైగా సబ్‌స్ర్రైబర్లను సంపాదించుకుని సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలో ఓ యవతితో ప్రేమలో పడిన నిజాముల్‌ ఖాన్‌.. తరచుగా ఆమెను కలుస్తూ ఉండేవాడు. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు కమల్‌ శర్మ(26) తన సోదరితో మాట్లాడవద్దని పలుమార్లు హెచ్చరించాడు. 

దీంతో కోపం పెంచుకున్న నిజాముల్‌ ఖాన్‌.. ఎలాగైనా అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ప్లాన్‌లో భాగంగా అక్టోబరు 28న కమల్‌ శర్మ ఇస్కాన్‌ టెంపుల్‌ గుండా వెళ్తున్న సమయంలో, మోటార్‌ సైకిల్‌ మీద వెంబడించి తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బులెట్‌ గాయంతో రోడ్డు మీద పడిఉన్న కమల్‌ను స్థానికులు ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. (చదవండి: యువతిపై ఘాతుకం.. ఆపై హత్యచేసిన దంపతులు)

కాగా తొలుత యాక్సిడెంట్‌గా భావించిన ఈ కేసులో అటాప్సీ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. కమల్‌ సోదరుడు నరేశ్‌ శర్మ ఫిర్యాదు మేరకు లోతుగా దర్యాప్తు చేపట్టగా, నిజాముల్‌ ఖాన్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలిందన్నారు. తన ఇద్దరు స్నేహితుల సాయంతో అతడు కమల్‌పై కాల్పులు జరిపాడని, యూట్యూబ్‌ వీడియోల ద్వారా వచ్చిన డబ్బులో కొంతవాళ్లకు ఇచ్చి ఈ నేరంలో భాగస్వామ్యం చేశాడని పేర్కొన్నారు. ముగ్గురిని అరెస్టు చేశామని, ఈ ఘటనతో మృతుడి సోదరికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో కూడా విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement