పేరెంట్స్‌తో కలిసి వ్యాక్సిన్‌ తీసుకున్న ఢిల్లీ సీఎం | Delhi Chief Minister Arvind Kejriwal takes his first dose of COVID19Vaccine | Sakshi
Sakshi News home page

పేరెంట్స్‌తో కలిసి వ్యాక్సిన్‌ తీసుకున్న ఢిల్లీ సీఎం

Published Thu, Mar 4 2021 11:31 AM | Last Updated on Thu, Mar 4 2021 12:25 PM

Delhi Chief Minister Arvind Kejriwal takes his first dose of COVID19Vaccine - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ గురువారం కోవిడ్‌ వాక్సిన్‌ తీసుకున్నారు. రెండవ దశ  కరోనా వ్యాక్సినేషన్‌లో భాగంగా ఆయన ఢిల్లీలోని ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రిలో వ్యాక్సిన్‌  మొదటి మోతాదును స్వీకరించారు. ప్రజలందరూ ముందుకు వచ్చి టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ సీఎంతో పాటు, ఆయన తల్లి దండ్రులు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవడం విశషం. అటు జమ్మూలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో  జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కూడా  ఈ రోజు వ్యాక్సిన్‌ మొదటి మోతాదును తీసుకున్నారు. (ఈ రోజు కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న దిగ్గజాలు)

చదవండి :  15 ఏళ్లుగా విసిగిపోయారు : ఎంసీడీలో ఇక ఆప్‌కే పట్టం


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement