
అంబాలెన్స్‌లకు మంగళం
అమలాపురం రూరల్: 1962 హెల్ప్ లైన్ మూగబోయింది. మొబైల్ వెటర్నరీ క్లినిక్‌లు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. మారుమూల పల్లెల్లో సైతం అందించే విశిష్ట పశువైద్య సేవలు నిలిచిపోయాయి. ఎన్నో అరుదైన, కష్టసాధ్యమైన శస్త్రచికిత్సలు చేసి మూగజీవాలకు ప్రాణదానం చేసిన మొబైల్ అంబులెన్స్‌లు రోడ్డెక్కడం లేదు. వారం రోజుల క్రితం అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా 7 అంబులెన్స్‌లు నిలిచిపోగా రేపో మాపో మిగిలిన 7 అంబులెన్స్‌లు కూడా ఆగిపోనున్నాయి.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా...
దేశంలోనే తొలిసారిగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో 108 అంబులెన్స్‌లు ప్రవేశపెట్టి పేదలకు ఎంతో సాంత్వన చేకూర్చారు. అదే స్ఫూర్తితో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి మూగజీవాల కోసం 2022 సంవత్సరంలో మే 19 తేదీన మొబైల్ అంబులెన్స్‌లు తీసుకువచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏర్పాటు చేసిన ఈ అంబులెన్సులు మంచి ఫలితాలు ఇవ్వడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో వీటిని సమకూర్చారు. నెలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల విలువ చేసే మందులు సైతం ఉచితంగా అందించారు. అర్హత కలిగిన పశువైద్యులు ఒక పేరావిట్, డ్రైవర్‌ను నియమించారు. 1962 ట్రోల్ నంబరు ఏర్పాటు చేశారు. రైతుల నుంచి ఫోన్ వచ్చిన వెంటనే 108 మాదిరిగానే మారుమూల ప్రాంతాలకు 1962 అంబులెన్సులు వెళ్లి రైతు ఇంటి వద్ద మూగజీవాలకు వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకున్నారు. మూగజీవాలకు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్ ద్వారా సమీప పశువుల అసుపత్రికి తీసుకువెళ్లి పశుసంవర్ధక శాఖ డాక్టర్లు, ఏడీల సహకారంతో శస్త్రచికిత్సలు అందించి ప్రాణం కాపాడేవారు.
కక్ష గట్టి కూటమి ప్రభుత్వం నిలిపివేత
ఉన్నత ఆశయంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంబులెన్‌న్స్‌లపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. కాంట్రాక్టు ముగిసిందనే నెపంతో 7 అంబులెన్స్‌లను ఈ నెల 16 నుంచి నిలిపివేసింది. మరికొన్ని రోజుల్లో మిగిలిన 7 అంబులెన్స్‌లను తొలగించేందుకు ఏర్పాట్లు చేస్తూ చేస్తున్నారు. వీటీని జీవీకే సంస్థ నిర్వహించేది. కాంట్రాక్టర్ గడువు ముగిసిందని కుంటి సాకుతో నిలిపివేశారు. ఒక్కసారిగా 1962 అంబులెన్స్ సేవలను నిలిపివేయడంతో రైతులు కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు. మూగజీవాల వైద్య సేవలకు అంతరాయం ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు. మరోపక్క 1962 అంబులెన్స్‌ల్లో పనిచేసిన ఉద్యోగులు పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది. కొత్త సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటే తమ పరిస్థితి ఏమిటని ఉద్యోగులు వాపోతున్నాడు. కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై ఆదోళన చెందుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2019 లెక్కల ప్రకారం జిల్లాలో పశువుల వివరాలు
ఉద్యోగుల నిరసన
మా కుటుంబాలు రోడ్డున పడకుండా ఉద్యోగాలు ఇవ్వాలని 1962 అంబులెన్స్ ఉద్యోగులు కోరుతున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పనిచేస్తున్న 1962 మొబైల్ అంబులెన్స్‌లలో పనిచేసే ఉద్యోగులు గురువారం అమలాపురంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లా పశువైద్య అధికారి వెంకట్రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ముందస్తు సమాచారం లేకుండా నోటీసు ఇవ్వకుండా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం లేకుండానే అంబులెన్స్‌లు నిలిపివేయడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంస్థ తమను మళ్లీ విధుల్లోకి తీసుకునేలా చూడాలని కోరారు జీవీకెఈఎమ్.ఆర్ ఐ. సంస్థ ద్వారా 2022 నుంచి విధులు నిర్వర్తిస్తే ఇప్పుడు తొలగించడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. డాక్టర్, పేరావిట్, డ్రైవర్‌లుగా పని చేస్తున్నామని మాకు న్యాయం చేయాలని కోరారు.
మాకు ఉద్యోగాలు ఇవ్వాలి
సంస్థలో మూడు సంవత్సరాలుగా పేరావిట్‌గా పనిచేస్తూ వేలాది పశువులకు సేవలు అందించాను. అధికారులు, ప్రభుత్వం స్పందించి ఉద్యోగులను విధులలోనికి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అన్యాయంగా తొలగించడం వల్ల మా కుటుంబాలు రోడ్డున పడతాయి.
– మోహన్, పేరావిట్, అమలాపురం
1962 అంబులెన్స్‌లో సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బంది (ఫైల్)
ఆగిపోయిన 1962 మొబైల్ అంబులెన్స్‌లు
కూటమి ప్రభుత్వంలో
పశువైద్యానికి కష్టకాలం
జిల్లాలో 7 వాహనాల నిలిపివేత
108 మాదిరిగా పశువుల కోసం
ప్రారంభించిన జగన్ ప్రభుత్వం
ప్రభుత్వ తీరుపై పాడి రైతుల ఆగ్రహం
ఆవులు 75,460
గేదెలు 1,53, 542
ఎద్దులు 57, 031
మేకలు 23.518
గొర్రెలు 25 ,111
పందులు 6.268
కుక్కలు 20,890
అంబులెన్స్ 14
ఉద్యోగులు 46

అంబాలెన్స్‌లకు మంగళం

అంబాలెన్స్‌లకు మంగళం
Comments
Please login to add a commentAdd a comment