మృతిరాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆందోళన
హైవేపై ఆందోళన చేసిన కట్టుంగగ్రామస్తులు, మృతురాలి బంధువులు
రావులపాలెం: రోడ్డు ప్రమాదంలో లారీ ఢీ కొట్టడంతో మహిళ మృతి చెందింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ బంధువులు, గ్రామస్తులు రావులపాలెం వద్ద జాతీయ రహదారిపై కళావెంకట్రావు సెంటర్‌లో మంగళవారం ఆందోళన చేపట్టారు. సోమవారం సాయంత్రం స్థానిక ఊబలంక రోడ్డులో టిప్పర్ లారీ ఢీ కొట్టిన ఘటనలో మృతిచెందిన వందే విజయకుమారి బంధువులు, గ్రామస్తులు ఆత్రేయపురం మండలం కట్టుంగ గ్రామం నుంచి రావులపాలెం చేరుకుని స్థానిక కళావెంకట్రావు సెంటరులో జాతీయ రహదారిపై ఆందోళళన చేశారు. మృతురాలి పిల్లలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. టౌన్ సీఐ శేఖరబాబు అక్కడి చేరుకుని వారితో మాట్లాడారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పోస్టుమార్టం ప్రక్రియ పూర్తి చేసి మృతదేహాన్ని అప్పగిస్తామని చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. దీంతో కాసేపటికి ఆందోళన విరమించారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment