ఇంటికో ఉద్యోగం కల్పించాలి
టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించినట్టు ఇంటికో ఉద్యోగం కల్పించాలి. దీనికి సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. నిరుద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ప్రతి నెలా రూ.3 వేల నిరుద్యోగ భృతి మంజూరు చేయాలి. అలా చేస్తే ఉద్యోగాల కోసం కోచింగ్ సెంటర్లకు వెళ్లే పేద విద్యార్థులకు వెసులుబాటుగా ఉంటుంది.
– నేరేడుమిల్లి నరేష్, విద్యార్థి నాయకుడు, గంటి, కొత్తపేట మండలం.
ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలి
కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలన్నీ భర్తీ చేయాలి. అలాగే ప్రభుత్వ పోస్టులను సైతం నింపాల్సి ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా పరిశ్రమల ఏర్పాటు చేయడం, చిన్న పరిశ్రమలతో చాలా వరకు నిరుద్యోగాన్ని తగ్గించవచ్చు. నిరుద్యోగ భృతి అందజేస్తే పోటీ పరీక్షలకు వెళ్లేవారికి మంచిది.
– చెల్లంగి రామకృష్ణారావు,
మాకనపాలెం,
మామిడికుదురు మండలం.
జాబ్ క్యాలెండ్ విడుదల చేయాలి
ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఉపాధ్యాయ పోస్టులే కాదు.. ప్రభుత్వ శాఖల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటితోపాటు పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి.
– చప్పిడి రాజేష్, ఈదరపల్లి,
అమలాపురం మండలం
ఇంటికో ఉద్యోగం కల్పించాలి
ఇంటికో ఉద్యోగం కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment