కలెక్టరేట్‌లో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్
కలెక్టర్ మహేష్‌కుమార్
అమలాపురం రూరల్: విదేశాలకు వలస వెళ్లినవారికి మార్గ నిర్దేశం చేసేందుకు కలెక్టరేట్‌లో కోనసీమ సెంటర్ ఫర్ మైగ్రేషన్ పేరుతో విదేశీ వ్యవహారాల హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ తెలిపారు. మంగళవారం హెల్ప్ డెస్క్‌ను ఆయన, ఎస్పీ బీ.కృష్ణారావు, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్‌ఓ బీఎల్‌ఎన్ రాజకుమారి, ఆర్డీవోలు కె.మాధవి, పి.శ్రీకర్, డి.అఖిల ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా నుంచి విదేశాలకు వలస వెళ్లి జీవనోపాధి పొందాలనుకునేవారికి పాస్‌పోర్టు, వీసాలు పొందేందుకు గల మార్గాలను సూచించడంతోపాటు అన్ని విధాలా గైడెన్స్ ఇస్తామన్నారు. ఈ ఈ కేంద్రాన్ని ఆరుగురు సిబ్బందితో నెలకొల్పామన్నారు. హెల్ప్ డెస్క్ నోడల్ అధికారి డీఎల్‌ఎన్ రాజకుమారి, సమన్వయకర్త గోళ్ళ రమేష్, పాల్గొన్నారు.
వాడపల్లి వెంకన్న కళ్యాణ ఉత్సవాలకు ఏర్పాట్లు
ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వరస్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలు ఏప్రిల్ 7 నుంచి 13వ తేదీ వరకు ఘనంగా నిర్వహిచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వేంకటేశ్వర స్వామి తీర్థ కళ్యాణ మహోత్సవాలపై దేవదాయ, పోలీసు రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ 7వ తేదీన ధ్వజారోహణ, 8న స్వామి వారి తీర్థం, రథోత్సవం కళ్యాణం కార్యక్రమాలు, 9వ తేదీ పొన్న వాహన సేవ, 11వ తేదీ గోదావరిలో తెప్పోత్సవం, 12వ తేదీ మహా పూర్ణాహుతి, చక్రస్నానం కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈవో చక్రధరరావు, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment