పదవులను బాధ్యతగా నిర్వహిద్దాం
– వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్య ప్రకాష్
మలికిపురం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మనపై ఎంతో నమ్మకంతో ఇచ్చిన పార్టీ పదవులను బాధ్యతగా నిర్వహిద్దామని, నూతనంగా నియమితులయిన వైఎస్సార్ సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పిల్లి సూర్యప్రకాష్ పేర్కొన్నారు. జిల్లా యువజన విభాగం అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని తొలిసారిగా ఆదివారం మలికిపురంలో పార్టీ కార్యాలయంలో నియోజక వర్గ పార్టీ కేడర్‌తో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పార్టీలో అన్ని వర్గాలకూ సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. వచ్చే నాలుగేళ్లలో శ్రమించి జిల్లాలో అత్యధిక స్థానాలలో పార్టీ విజయం సాధించేలా కృషి చేద్దామన్నారు. ఇందుకోసం పార్టీ కేడర్ అంతా శ్రమించాలన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ఎంతో ఉత్తమ పాలన అందించిందన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం పాలన అస్తవ్యస్థం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న ఏకై క ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో అవినీతి విలయ తాండవం చేస్తోందన్నారు. కూటమి పాలనపై ఎనిమిది నెలల్లోనే ప్రజలు విరక్తి చెందారన్నారు. మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో జిల్లాలో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతం అయి వచ్చే ఎన్నికల నాటికి విజయ తీరాలకు చేరుద్దామన్నారు. జగన్ నేతృత్వంలో అంతా కలిసిమెలసి పనిచేసి ముందుకు సాగుదామన్నారు. నాయకులు కేఎస్‌ఎన్ రాజు, జంపన బుజ్జిరాజు, కంచర్ల శేఖర్, పాటి శివకుమార్, బొలిశెట్టి భగవాన్, కుసుమ చంద్రశేఖర్, గుబ్బల మనోహర్, ఈద రవిరెడ్డి, గుబ్బల వీర వెంకట సత్యనారాయణ, గుర్రం జాషువా, తాడి సహదేవ్, నామన మణికంఠ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సూర్య ప్రకాష్‌ను శాలువాలతో సన్మానించి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment