అమలాపురంలో మేధావుల సమావేశం
అమలాపురం రూరల్: ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని అమలాపురంలో కేంద్ర బడ్జెట్‌పై జరిగిన మేధావుల సమావేశం తెలిపింది. అమలాపురం ప్రెస్ క్లబ్ హాల్‌లో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో కేంద్ర బడ్జెట్‌పై మేధావుల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.డి.విల్సన్ మాట్లాడుతూ కులాలకు, మతాలకు, వర్గాలకు అతీతంగా దేశ సమగ్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ అని అన్నారు. ఈ బడ్జెట్ ద్వారా వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. యువతను పారిశ్రామిక రంగంలో అభివృద్ధి చేయటానికి ఎంఎస్‌ఎమ్‌ఈలకు 2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. వాళ్లకు ఇచ్చే రుణాలు రూ.ఐదు కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెంచే ప్రణాళిక సిద్ధం చేశారని అన్నారు. మహిళల అభివృద్ధికి సంబంధించి అనేక పథకాలు ప్రవేశపెట్టారు. రైతు కిసాన్ పథకాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారన్నారు. మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు బోనం సత్తిబాబు, జిల్లా ఇంజినీర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏడిద దొరబాబు, వివిధ వ్యాపార సముదాయాల అధ్యక్షులు నల్లా పవన్‌కుమార్, గోకరకొండ హరిబాబు, కంచిపల్లి అబ్బులు, మేడిచర్ల త్రినాథ్, వంటెద్దు బాబు, డాక్టర్ వీరా ధన్వంతరీ, మణికుమారి, డాక్టర్లు, లాయర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment