భీమేశ్వరునికి నేత్రపర్వంగా..
సామర్లకోట: బాలాత్రిపుర సుందరి సమేత కుమార రామభీమేశ్వరస్వామి కల్యాణం సోమవారం రాత్రి నేత్రపర్వంగా జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలకు స్వాగతం పలుకుతూ స్వామి వారి కల్యాణం జరుగుతుంది. దీనిలో భాగంగా ఉదయం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం నంది వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. పురవీధుల గుండా గ్రామోత్సవం పూర్తి చేసుకొని రాత్రి ఆలయానికి చేరింది. ఆలయంలో గ్రామోత్సవంలో పాల్గొన్న స్వామి వారి, అమ్మవారి ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాండ్ మేళాల మధ్య ఆలయంలోని తోటలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామి, అమ్మ వారి విగ్రహాలను ఉంచారు. ఈ మేరకు వేదికను పూలతో అలంకరించారు. అన్నవరం దేవస్థానం నుంచి వేదపండితులు పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చారు. పారిశ్రామిక వేత్త గంజి బూరయ్య ముత్యాల తలంబ్రాలు ఏర్పాటు చేశారు. అన్నవరం, ఆలయ వేద పండితులు వేద మంత్రాల మధ్య స్వామి అమ్మవార్ల కల్యాణం నేత్ర పర్వంగా జరిగింది. ఈ కల్యాణంను తిలకించడానికి జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు దంపతులు, ఈఓ బళ్ల నీలకంఠం ఆధ్వర్యంలో కల్యాణం నిర్వహించారు. అన్నవరం వేద పండితులు, ఆలయ వేద పండితుల వేద మంత్రాల మధ్య కల్యాణంలో పట్టణ పరిఽధిలోని పారిశ్రామిక వేత్తలు, రైతులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భీమేశ్వరునికి నేత్రపర్వంగా..
Comments
Please login to add a commentAdd a comment