వెటరన్ టీటీ పోటీలలో మోహన్‌బాబుకు కాంస్యం
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ఈ నెల 17 నుంచి 23 వరకు జరిగిన 31వ జాతీయస్థాయి వెటరన్ టేబుల్ టెన్నిస్ పోటీలలో ఏపీ జట్టు ప్రతిభను కనబరచి రాష్ట్ర చరిత్రలో తొలిసారి కాంస్య పతకం కైవసం చేసుకుంది. ఈ పోటీలలో పాల్గొనే రాష్ట్ర జట్టుకు కాకినాడ జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆయుష్ వైద్యాధికారి కోటగిరి మోహన్ బాబు కెప్టెన్‌గా వ్యవహించారు. నాకౌట్ పోటీలలో కర్ణాటక, గుజరాత్ బి, చండీఘర్ జట్లపై గెలుపొంది సెమీఫైనల్స్‌లో గుజరాత్ ఏ పై 3–2 స్కోర్‌తో ఏపీ జట్టు ఓటమి చెంది తృతీయస్థానంలో నిలిచింది. 1975 నుంచి టీటీ ఆడుతున్న మోహన్‌బాబు 1978లో కాలికట్ నేషనల్స్, 1982, 84లో ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తతం కాకినాడ డీఎస్‌ఏ టీటీ హాల్‌లో క్రీడాకారులకు తర్ఫీదునిస్తున్నారు. జాతీయస్థాయిలో పతకం సాధించిన మోహన్‌బాబును జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, జిల్లా టీటీ సంఘ గౌరవ అధ్యక్షుడు రావు చిన్నారావు, అధ్యక్షుడు విజయప్రకాష్, ఉపాధ్యక్షుడు దంటు భాస్కర్, టీటీ క్రీడాకారుడు సింగరాజు సోమవారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment