చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య
గండేపల్లి: మండలంలోని మురారిలో పోలవరం గట్టు వద్ద గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. సుమారు 35 నుంచి 40 సంవత్సరాలు వయస్సు గల మృతుని ఒంటిపై నీలం, పసుపు, నలుపు రంగు గల పొడుగు చేతుల చొక్కా, బిస్కెట్ రంగు ఫ్యాంట్, మెరూన్ రంగు డ్రాయర్ ధరించి ఉన్నాడు. పక్కనే సైకిల్ పడి ఉంది. గ్రామ వీఆర్‌ఏ ఫిర్యాదు మేరకు గండేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. మృతుని ఆచూకీ తెలిస్తే సెల్: 9440796529, 9440904841 నెంబర్లకు తెలియజేయాలని ఎస్సై యువీ శివనాగబాబు తెలిపారు. మృతదేహాన్ని పెద్దాపురం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో 72 గంటల పాటు ఉంచనున్నట్టు చెప్పారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
సామర్లకోట: స్థానిక రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఇది. రైల్వే హెచ్‌సీ శ్రీనివాసులు కథనం ప్రకారం సామర్లకోట నుంచి విజయవాడ వైపు వెళుతున్న రైలు నుంచి 30–35 సంవత్సరాల వయసు వ్యక్తి జారి పడి అక్కడిక్కడే మృతి చెందాడు. రైల్వే మేనేజర్ ఎం.రమేష్ నుంచి వచ్చిన ఫిర్యాదుతో ఘటనా ప్రదేశానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి కుడి చేయి దిగువ భాగంలో ఈశ్వరీ అని తెలుగులో పచ్చబోట్టుతో రాసి ఉంది. వివరాల కోసం రైల్వే పోలీసు స్టేషన్‌లో సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి రైల్వే ఎస్సై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment