వాలీ‘బాల్’మే సవాల్
ఉప్పలగుప్తం: ఆలిండియా పురుషుల వాలీబాల్ పోటీల నిర్వహణకు ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో సర్వం సిద్ధమైంది. అరిగెల శ్రీరంగయ్య వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహా శివరాత్రి సందర్భంగా ఈ పోటీలు నిర్వహించనున్నారు. బుధవారం నుంచి మార్చి ఒకటి వరకు ఈ పోటీలు డే అండ్ నైట్ పద్ధతిలో జరగనున్నాయి. ఈ పోటీలు గొల్లవిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానం వేదిక కాబోతోంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు గొల్లవిల్లి జెడ్పీ మైదానంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్టు నిర్మించారు. సుమారు ఐదు వేల మంది వీక్షించేలా గ్యాలరీ నిర్మాణం చేశారు. నాలుగు రోజుల పాటు జరిగే పోటీల్లో జీఎస్‌టీ (ముంబాయి), కర్ణాటక స్పైకర్స్, కేరళ స్పైకర్స్, ఇండియన్ బ్యాంకు(చైన్నె), ఇన్‌కం ట్యాక్స్ (చైన్నె), హూపర్స్ స్పోర్ట్స్ క్లబ్ (ముంబాయి) జట్లు పాల్గొననున్నాయి. అంతర్జాతీయ పోటీలకు ప్రాతినిధ్యం వహించిన సుమారు 20 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొనున్నారని నిర్వాహకులు తెలిపారు.
నాలుగు దశాబ్దాల క్రితం
గొల్లవిల్లిలో నాలుగు దశాబ్దాల క్రితం కోనసీమ స్థాయిలో వాలీబాల్ పోటీలు మొదలయ్యాయి. 1988లో యూఎస్‌ఎస్‌ఆర్ మెమోరియల్ పేరుతో తొలిసారిగా కోనసీమ స్థాయిలో ఇక్కడ వాలీబాల్ టోర్నమెంట్ ఆరంభమైంది. 1990లో కోనసీమ, 1991 తూర్పుగోదావరి జిల్లా, 1992 ఉభయ గోదావరి జిల్లాలు, 1993 నుంచి 2001 వరకు రాష్ట్రస్థాయి పోటీలు జరిగాయి. 2012న తిరిగి ఎస్‌పీఆర్ మెమోరియల్ పేరుతో రెండు సార్లు రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. 2017 నుంచి ఎన్‌వీఆర్ పేరుతో నాలుగేళ్ల పాటు జాతీయ స్థాయి పోటీలు జరిగాయి. తాజాగా అరిగెల శ్రీరంగయ్య వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరోసారి జాతీయ పోటీల నిర్వహణ చేపట్టారు.
నేటి నుంచి జాతీయ స్థాయి
వాలీబాల్ పోటీలు
ముస్తాబైన గొల్లవిల్లి
అంతర్జాతీయ క్రీడాకారుల రాక
Comments
Please login to add a commentAdd a comment