
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
ఉప్పలగుప్తం: జాతీయ వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలో తలపడుతున్న ఇరు జట్లు నువ్వా... నేనా అన్నట్టుగా తలపడుతుండడంతో పలు మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగుతున్నాయి. అంతర్జాతీయ, జాతీయ క్రీడాకారులు రావడంతో పోటీలు రసవతర్తరంగా సాగుతున్నాయి. క్రీడాకారులు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లిలో అరిగెల శ్రీ రంగయ్య మెమోరియల్ డే అండ్ నైట్ వాలీబాల్ పోటీలు గురువారం రెండవ రోజు జరిగాయి. ముంబై జీఎస్‌టీ, కేరళ స్పైకర్స్ మధ్య జరిగిన పోటీ వాలీబాల్ ఆట మజాను క్రీడా వీక్షకులకు చూపించింది. రెండు జట్లు చావోరేవు అన్నట్టుగా తలపడడంతో పోటీ వీక్షకులను ఉర్రూతలు ఊగించింది. తొలి మ్యాచ్‌ను ముంబై జట్టు 25–20 తేడాతో విజయం సాధించగా, రెండు, మూడు మ్యాచ్‌లను కేరళ జట్టు 25–23, 25–19 తేడాతో గెలుచుకుంది. నాల్గవ మ్యాచ్‌ను ముంబై జట్టు 25–22 తేడాతో గెలవగా, కీలకమైన ఐదవ మ్యాచ్ 15–13వ తేదీ ముంబై జట్టు విజయం సాధించి విజేతగా నిలిచింది. ప్రతి మ్యాచ్‌లోనూ.. ప్రతి పాయింట్ ఇరు జట్లు సమానంగా సాధించడంతో ఈ పోటీ రసవత్తరంగా మారింది. కీలకమైన ఐదవ మ్యాచ్‌లో సహితం 1–1, 2–2... 13–13 వరకు స్కోర్ నమోదయ్యింది. చివరి రెండు పాయింట్లు ముంబై జట్టు సాధించడంతో విజేతగా నిలిచింది. అలాగే ఇండియన్ బ్యాంకు చైన్నైపె బెంగళూరు స్పైకర్స్ జట్టు విజయం సాధించింది. ఈ పోటీలు శుక్ర, శనివారాలలో కూడా జరగనున్నాయి.
ముంబై... కేరళ జట్ల మధ్య
మూడు గంటల పోరు

హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
Comments
Please login to add a commentAdd a comment