హంస వాహనంపై వీరేశ్వరుని తెప్పోత్సం
మురమళ్ల గౌతమీ గోదావరిలో
విహరిస్తున్న భద్రకాళీ
సమేత వీరేశ్వరస్వామి
ఐ.పోలవరం: పార్వతి పరమేశ్వరుల నదీ వీహార మహోత్సవం అంబరాన్ని తాకింది. మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా మురమళ్ల భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం స్వామి, అమ్మవార్లను మేళతాళాలు, బాజాభజంత్రీలతో, బాణసంచా కాల్పులతో, వివిధ రకాల సాంసృతిక కార్యక్రమాలతో భారీ ఎత్తున గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం వృద్ధ గౌతమీ గోదావరిలో పంచ హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై స్వామి, అమ్మవార్లు విహరించారు.
Comments
Please login to add a commentAdd a comment