
రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి
●
● ఇప్పటి వరకూ ప్రభుత్వం
స్పందించకపోవడం దారుణం
● రాష్ట్ర కాపు జేఏసీ నేతల డిమాండ్
● తాడిపూడి మృతుల
కుటుంబాలకు పరామర్శ
తాళ్లపూడి: మహాశివరాత్రి సందర్భంగా గత నెల 26న తాడిపూడిలో గోదావరి పుణ్యస్నానాలకు వెళ్లి, ఐదుగురు యువకులు మృతి చెందితే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ కనీసంగా కూడా స్పందించకపోవడం బాధాకరమని రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు జెట్టి గురునాథం, తోట రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పంధించి మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామానికి చెందిన మృతుల కుటుంబాలను రాష్ట్ర కాపు జేఏసీ, నియోజకవర్గ కాపు నాయకులు సోమవారం పరామర్శించారు. పడాల దుర్గా ప్రసాద్, పడాల దేవదత్త సాయి, అనిశెట్టి పవన్ గణేష్, గర్రే ఆకాష్, తిరుమలశెట్టి పవన్ కుమార్‌ల కుటుంబ సభ్యులను కలిసి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాపు సంఘం తరఫున ఒక్కొక్క మృతుని కుటుంబానికి రూ.30 వేల చొప్పున మొత్తం రూ.1.50 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా గురునాథం మాట్లాడుతూ, ఈ ఘటనపై ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కాపు జేఏసీ సభ్యుడు, వైఎస్సార్ సీపీ జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షుడు తోట రామకృష్ణ మాట్లాడుతూ, కాపుల ఓట్లతో గెలిచిన కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలని అన్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా కూడా పవన్ కల్యాణ్‌కు చేరాలని, బాధితులకు న్యాయం చేయాలంటూ పోస్టులు పెట్టి వైరల్ చేస్తున్నారని అన్నారు. తాడిపూడి సర్పంచ్ నామా శ్రీనివాస్ మాట్లాడుతూ, మృతుల కుటుంబాలకు ర్యాంపు నిర్వాహకులు కూడా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల కాపు సంఘం అధ్యక్షుడు నామా ప్రకాశం, పోలవరం ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, కరిబండి విద్యాసంస్థల డైరెక్టర్ కరిబండి త్రినాథస్వామి, కాపు నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment