భీమేశ్వరుని ఆదాయం రూ.28.87 లక్షలు
రామచంద్రపురం రూరల్: దక్షిణ కాశీ ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి ఆలయ హుండీ ఆదాయం రూ.28,87,291 వచ్చినట్లు ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆలయ ప్రాంగణంలో ఉప కమిషనర్ డీఎల్‌వీ రమేష్‌బాబు, ఎంఎస్‌ఎన్ చారిటీస్ ఈఓ, దేవదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ కె. విజయలక్ష్మి సమక్షంలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఆలయ హుండీల ద్వారా 2024 డిసెంబరు 13వ తేదీ నుంచి ఈ నెల ఐదో తేదీ వరకు 83 రోజులకు రూ.27,97,105, అన్నదానం హుండీల ద్వారా రూ.90,186 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. అలాగే 10 గ్రాముల బంగారం వచ్చినట్లు పేర్కొన్నారు.
మెహబూబ్ సిస్టర్స్‌కు
డీఈవో అభినందన
ముమ్మిడివరం: అమలాపురానికి చెందిన మాస్టర్ అథ్లెట్స్ మెహబూబ్ సిస్టర్స్ షహీరా, షకీలాను డీఈవో డాక్టర్ షేక్ సలీమ్ బాషా బుధవారం ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల మెహబూబ్ సిస్టర్స్ అనంతపురం, హైదరాబాద్‌లలో జరిగిన రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీల్లో స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించి జాతీయ పోటీలకు ఎంపికై న సంగతి తెలిసిందే. 75 ప్లస్ (వయస్సు) విభాగంలో షహీరా, 65 ప్లస్ విభాగంలో షకీలా పతకాలు సాధించడం అభినందనీయమని డీఈవో బాషా అన్నారు. ముమ్మిడివరంలోని డీఈవో కార్యాలయంలో మెహబూబ్ సిస్టర్స్ డీఈవోను బుధవారం కలిశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ఈ సిస్టర్స్ మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో సత్తా చాటుతూ పతకాలు సాధించడం జిల్లాకే గర్వ కారణమని పేర్కొన్నారు.
ఏడున ఫిమేల్ జాబ్ మేళా
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లోని వికాస సంస్థ జిల్లా కార్యాలయంలో ఈ నెల ఏడో తేదీన శుక్రవారం ఫిమేల్ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుక్కుగూడ హైదరాబాద్‌లో గల ఫాక్స్‌కాన్ కంపెనీలో ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ పాస్ లేదా ఫెయిల్, డిగ్రీ పాస్ లేదా ఫెయిల్ అయిన వారు అర్హులు అని ఆయన స్పష్టం చేశారు. ఈ సంస్థలలో మొబైల్ అసెంబ్లింగ్ యూనిట్‌లో ఆపరేటర్‌గా పని చేయడానికి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని, జిల్లాలో అర్హులైన నిరుద్యోగ యువతులు సద్వినియోగం చేసుకోవాలని వికాస జిల్లా మేనేజర్ రమేష్ విజ్ఞప్తి చేశారు.
భీమేశ్వరుని ఆదాయం రూ.28.87 లక్షలు
Comments
Please login to add a commentAdd a comment