తాళం వేసిన దుకాణంలో చోరీ
అమలాపురం టౌన్: స్థానిక నారాయణపేటలో శ్రీహరి ఆటో మొబైల్స్ పేరిట నిర్వహిస్తున్న మోటారు సైకిల్ మెకానిక్ షాపులో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోరీ జరిగింది. మూడు పోర్షన్లు ఉన్న పెంటిల్లు అది. ఆ ఇంట్లో షాపుగా ఉన్న పోర్షన్‌కు తాళం వేసి ఉండగానే చోరీ జరిగి నగదు మాయం కావడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షాపు యాజమాని దనలకోట కృష్ణ షాపులో ఓ సంచిలో రూ.10 లక్షల వరకూ దాచుకున్నానని, అవి చోరీకి గురయ్యాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. పట్టణ సీఐ పి.వీరబాబు, ఎస్సై తిరుమలరావు, క్రైమ్ పార్టీ పోలీసులు బుధవారం ఉదయం చోరీ జరిగిన తీరును పరిశీలించారు. తాను రెండేళ్ల కిందట స్థలం విక్రయించిన సొమ్ములు, తాను రోజు సంపాందించిన సొమ్మలను షాపులో ఓ సంచిలో దాచుకుంటున్నానని యాజమాని తెలిపాడు. ఈ డబ్బులను తన కుమారుడి వివాహానికి కూడబెట్టానని పోలీసులకు వివరించాడు. నారాయణపేటలోనే ఉన్న తన సొంత ఇంట్లో నగదు దాచుకోకుండా షాపులో ఉండచంపై, షాపు తాళం తీయకుండానే సొమ్ము పోవడంపై కృష్ణను పలు కోణాల్లో విచారిస్తున్నారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లతో దర్యాప్తు చేస్తున్నారు. తెలుసున్న వ్యక్తులే ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చోరీ జరిగిన ఇంటి మూడు పోర్షన్లలో ఒకటి అద్దెకు ఇవ్వగా, మరొకదానిలో కృష్ణ సోదరుడు ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం షాపునకు తాళం వేసి వెళ్లిన కృష్ణ బుధవారం ఉదయం వచ్చి షాపు తాళం తీసి లోనికి వెళ్లినప్పుడు చోరీ జరిగినట్లు గమనించాడు.
రూ.10 లక్షల అపహరణ నారాయణపేటలో ఘటన
Comments
Please login to add a commentAdd a comment