
ఆత్మహత్య చేసుకుని వ్యక్తి మృతి
కె.గంగవరం: మండల పరిధిలోని సుందరపల్లి గ్రామానికి చెందిన అడపా శ్రీనివాస్(42) బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాస్ స్థానికంగా కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య రమాదేవితో పాటు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. కొంత కాలంగా మానసిక రుగ్మతతో బాధపడుతున్న శ్రీనివాస్ అమలాపురంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు. ఇదే క్రమంలో బుధవారం సాయంత్రం పశువుల పాకలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై జానీబాషా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అకౌంట్‌లో సొమ్ము
కాజేసిన ౖసైబర్ కేటుగాట్లు
కొవ్వూరు: సీతంపేట గ్రామానికి చెందిన సంగీత స్వాతి అనే మహిళ వాటాప్స్ చూస్తుండగా వచ్చిన ఏపీకే మెసేజ్‌పై క్లిక్ చేయగా తన బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.49,700లు గల్లంతైనట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని రూరల్ ఎస్సై కె.శ్రీహరిరావు తెలిపారు. గత డిసెంబర్ నెల 29వ జరిగిన ఈ ఘటనపై 1930 నంబర్‌కి కాల్ చేసి సైబర్ క్రైమ్‌కి ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది. తర్వత వాడపల్లి బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. నాలుగు రోజుల తర్వాత తన ఖాతాలో ఉన్న సొమ్మును బ్యాంకు అధికారులు అదే నెల 31వ తేదీన ఫ్రీజ్ చేసినట్లు మేసెజ్‌లు వచ్చాయని ఆమె పేర్కోంది. గురువారం స్వాతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment