
24, 25 తేదీల్లో బ్యాంకుల సమ్మె
అమలాపురం టౌన్: ఈనెల 24, 25 తేదీల్లో యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ (యూఎఫ్‌బీయూ) ఆధ్వర్యంలో జిల్లాలో వాణిజ్య బ్యాంక్‌లు సమ్మె చేపడుతున్నట్లు ఈ యూనియన్ కోనసీమ చైర్మన్ పీవీవీ సత్యనారాయణ తెలిపారు. ఈ సమ్మెకు సమాయత్తమవుతున్న కోనసీమలోని దాదాపు 300 మంది బ్యాంక్ అధికారులు, ఉద్యోగులు స్థానిక యూనియన్ బ్యాంక్ మెయిన్ బ్రాంచి వద్దకు శుక్రవారం సాయంత్రం చేరుకుని తమ డిమాండ్ల సాధనకు నినాదాలు చేశారు. సమ్మె సన్నద్ధతపై యూనియన్ కోనసీమ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ కొత్త సిబ్బందిని అన్ని కేడర్లలో నియమించాలని, తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, 5 రోజుల పని దినాలను అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ కన్వీనర్ గణేష్‌కుమార్, సెక్రటరీ బి.శ్రీనివాస్, ఎల్‌డీఎం వర్మ, వివిధ బ్యాంకుల అధికారులు బి.వెంకటేశ్వరరావు, రమేష్, సురేష్‌కుమార్, కె.ఈశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment