ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా
13 మంది విద్యార్థులకు గాయాలు
జగ్గంపేట: జగ్గంపేట మండలం కాండ్రేగుల గ్రామంలో మంగళవారం ఉదయం విద్యార్థులతో జగ్గంపేట వస్తున్న ఒక ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది విద్యార్థులు ఉండగా వీరిలో 9 మందికి స్వల్పంగాను, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జగ్గంపేట ఎస్సై రఘునాథరావు తెలిపిన వివరాల మేర కు ఉదయం జగ్గంపేట వస్తున్న బస్సు కాండ్రేగుల గ్రామ శివారులో బోల్తాపడింది. స్థానికుల సహకారంతో విద్యార్థులను బయటకు తీసి జగ్గంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. వీరిలో 9 మందిని ప్రాథమిక చికిత్స అనంతరం ఇళ్లకు పంపించేశారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురు తోటకూర కార్తీక్ నాగేంద్ర, అనితా రామచక్ర, ద్వారపూడి ధనలక్ష్మి, బొదిరెడ్డి శ్రావణిలను మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్టు పేర్కొన్నారు. స్కూల్ కరస్పాండెట్, వైఎస్సార్ సీపీ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు ఒమ్మి రఘురాంఆస్పత్రికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విద్యార్థులందరూ 6 నుంచి 9 తరగతి చెందిన వారని, డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఎస్సై తెలిపా రు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రణీత్ విద్యార్థులకు వైద్య సేవలందించారు.
Comments
Please login to add a commentAdd a comment