పొలంలో స్వల్పంగా గ్యాస్‌ లీక్‌ | - | Sakshi
Sakshi News home page

పొలంలో స్వల్పంగా గ్యాస్‌ లీక్‌

Published Sat, Mar 15 2025 12:32 AM | Last Updated on Sat, Mar 15 2025 12:32 AM

పొలంలో స్వల్పంగా గ్యాస్‌ లీక్‌

పొలంలో స్వల్పంగా గ్యాస్‌ లీక్‌

మామిడికుదురు: పాశర్లపూడి–43 బావి నుంచి తాటిపాక జీసీఎస్‌కు గతంలో వేసిన పైపులైన్‌ నుంచి శుక్రవారం స్వల్పంగా గ్యాస్‌ లీకై ంది. మామిడికుదురు గ్రామంలో ఏటిగట్టు పక్కన పొలాల్లో ఈ లీకేజ్‌ ఏర్పడింది. లీకేజ్‌ ఏర్పడిన చోట నుంచి స్వల్పంగా గ్యాస్‌ బయటకు వచ్చింది. దీంతో పాటు కొద్దిగా ముడి చమురు కూడా లీకై ంది. దీంతో ఆ ప్రాంతమంతా ముడి చమురు వాసన వ్యాపించింది. ముడి చమురు ప్రభావంతో పొలంలో నీరు తెట్టు కట్టింది. ఓఎన్‌జీసీ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ బావి నుంచి ఎటువంటి ఉత్పత్తి జరగడం లేదన్నారు. చాలా కాలం క్రితం ఆ బావిలో ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. పైపులైన్‌లో ఉన్న గ్యాస్‌, ముడి చమురు బయటకు వచ్చి ఉంటాయన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement