రెండో రోజూ ‘పది’ ప్రశాంతం
18,861 మంది విద్యార్థులు హాజరు
ముమ్మిడివరం: పదో తరగతి పరీక్షలు రెండో రోజైన మంగళవారం ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 22 మండలాల్లో ఏర్పాటు చేసిన 110 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన హిందీ పరీక్షకు 18,861 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 26 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. మొత్తం 98 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరిగాయి. మొత్తం 99.48 శాతం మంది హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి డా.షేక్ సలీం బాషా తెలిపారు. పరీక్షా కేంద్రాలను ఆర్‌జేడీ జి.నాగమణి, డీవైఈవో జి.సూర్యప్రకాష్, ప్రభుత్వ పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావుతో పాటు, ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్ల వారు మొత్తం 54 పరీక్షా కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేసినట్టు డీఈఓ సలీం బాషా తెలిపారు.
ఏకై క కేంద్రంలో
ఇంటర్ పరీక్ష
అమలాపురం టౌన్: ఇంటర్మీడియెట్ ఫస్టియర్ జాగ్రఫీ పరీక్ష ఆలమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో బుధవారం ప్రశాంతంగా జరిగిందని డీఐఈవో వనుము సోమశేఖరరావు తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 16 మందికి ఒక్క విద్యార్థి మాత్రం హాజరు కాలేదు. మిగిలిన 15 మంది విద్యార్థులు పరీక్షలు రాశారని సోమశేఖరరావు చెప్పారు. ఇదే జాగ్రఫీ పరీక్ష గురువారం కూడా ఒకే ఒక పరీక్షా కేంద్రంలో సెకండియర్ విద్యార్థులకు జరుగుతుందని తెలిపారు.
అభయాంజనేయుడికి
వెండి కిరీటం సమర్పణ
అమలాపురం టౌన్: పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద మెయిన్ రోడ్డులో ఉన్న అభయాంజనేయస్వామి ఆలయంలో స్వామికి భక్తులు వెండి కిరీటాన్ని బహూకరించారు. స్థానిక గాంధీనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కొల్లాటి సాయిరామ్, వీరవేణి దంపతులు రూ.1.50 లక్షలతో తయారు చేయించిన వెండి కిరీటాన్ని బుధవారం సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి, వేద మంత్రాల నడుమ స్వామికి కిరీటాన్ని అలంకరించారు.
అమ్మవారి హుండీల
ఆదాయం రూ.5.98 లక్షలు
సఖినేటిపల్లి: కేశవదాసుపాలెం శివారు మెండుపాలెంలో ఉన్న పెద్దింట్లమ్మ అమ్మవారి ఆలయంలో వివిధ హుండీల ద్వారా మొత్తం రూ.5,98,613 ఆదాయం వచ్చింది. బుధవారం ఆలయం వద్ద ఎండోమెంట్స్ ఇన్‌స్పెక్టర్ జె.రామలింగేశ్వరరావు, అంతర్వేది ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఎస్సై కె.దుర్గా శ్రీనివాసరావు సమక్షంలో హుండీలను తెరిచి 19 రోజుల ఆదాయాన్ని లెక్కించారు. విదేశీ కరెన్సీ పది దిర్హమ్స్ ఉన్నాయి.
ఈ–కేవైసీ పూర్తి చేయాలి
అమలాపురం రూరల్: ప్రభుత్వ పథకాల సమగ్ర అమలుకు నూరు శాతం ఈ–కేవైసీ పూర్తి చేయాలని జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయభాస్కర్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో రేషన్ డీలర్లకు ఈ–కేవైసీపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ నెలాఖరులోగా ఈ–కేవైసీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. అన్ని రేషన్ షాపుల్లో డీలర్లు ఈ–పాస్ యంత్రంతో ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటారన్నారు. మార్చి 20 నుంచి 31 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఈ–కేవైసీ చేయించవచ్చన్నారు.
రెండో రోజూ ‘పది’ ప్రశాంతం
రెండో రోజూ ‘పది’ ప్రశాంతం
Comments
Please login to add a commentAdd a comment