
రిలయన్స్ మార్ట్‌పై కేసు నమోదు
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని పుష్కర్ ఘాట్ వద్ద గల రిలయన్స్ మార్ట్ పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా గురువారం లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ శామ్యూల్ రాజు ఆధ్వర్యంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. తయారీ తేదీ, గడువు తేదీని ట్యాంపర్ చేసినట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. వినియోగదారులు వస్తువుల కొనుగోలు సమయంలో ప్యాకేజీ ఎక్స్‌పెయిరీ డేట్, ఎంఆర్పీ ధరను పరిశీలించాలని జిల్లా వినియోగదారుల రక్షణ మండలి సభ్యుడు గొట్టిముక్కల అనంతరావు విజ్ఞప్తి చేశారు. ఎంఆర్పీ కన్నా అధిక ధరలకు విక్రయించినా, యూజ్ బై డేట్ ముగిసినవి అమ్మినా లీగల్ మెట్రాలజీ అధికారులకు తెలియజేయాలని కోరారు. ఈ తనిఖీలో పాల్గొన్న అనంతరావు మాట్లాడుతూ వినియోగదారులు తగిన జాగ్రత్తలతో మెలగాలని, ఫిర్యాదులు ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఇటువంటి వ్యవహారాలపై అధికారులు కేసు నమోదు చేస్తారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment