సైక్లోథాన్ పునఃప్రారంభం
అమలాపురం టౌన్: దేశ సమగ్రత, సమైక్యత కోసం కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్‌ఎఫ్) ఆధ్వర్యాన దేశంలోని సముద్ర తీర నగరాలు, పట్టణాల మీదుగా సైక్లోథాన్ (సైకిల్ యాత్ర) చేపట్టడం అభినందనీయమని డీఆర్‌ఓ బీఎల్‌ఎన్ రాజకుమారి అన్నారు. బుధవారం సాయంత్రానికి అమలాపురం చేరుకున్న సైకిల్ యాత్రికులు రాత్రి ఇక్కడ బస చేసి, గురువారం ఉదయం స్థానిక గడియారం స్తంభం సెంటర్ నుంచి తమ యాత్రను పునఃప్రారంభించారు. డీఆర్‌ఓ రాజకుమారి, జిల్లా ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్ జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. నర్సాపురం, మచిలీపట్నం మీదుగా సైకిల్ యాత్ర సాగనుందని సీఐఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండర్ వీఏ ప్రభాకర్ తెలిపారు. ఈ సైకిల్ యాత్ర ఈ నెల 31న తమిళనాడులోని కన్యాకుమారిలో ముగుస్తుందని చెప్పారు. ఈ యాత్ర ద్వారా సీఐఎస్‌ఎఫ్ దళాల సభ్యులు దేశ సమగ్రత, సమైక్యతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. యాత్ర పునఃప్రారంభ కార్యక్రమంలో ఆర్మ్‌డ్ డీఎస్పీ సుబ్బరాజు, ఏఆర్ ఆర్‌ఐ ఎన్.బ్రహ్మానందం, తహసీల్దార్ పి.అశోక్ ప్రసాద్, వెటరన్ క్రీడాకారులు మెహబూబ్ సిస్టర్స్ షహీరా, షకీలా తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యా విజ్ఞాన
విహార యాత్ర
అమలాపురం రూరల్: విద్యా విజ్ఞాన విహార యాత్రను శుక్రవారం కలెక్టరేట్ వద్ద ప్రారంభిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీం బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ యాత్రలో 131 మంది విద్యార్థులు, 20 మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని తెలిపారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంపొందించేందుకు ఈ యాత్రను రూపొందించారన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు తిరుపతిలోని ఐఐటీ, రీజినల్ సైన్స్ సెంటర్, జూలాజికల్ గార్డెన్, చంద్రగిరి కోట వంటి వాటిని సందర్శిస్తారని వివరించారు. అనంతరం జిల్లాలోని కోరింగ అభయారణ్యాన్ని సందర్శిస్తారన్నారు. ఈ యాత్ర ఈ నెల 23న ముగుస్తుందని తెలిపారు.
ఉచిత శిక్షణ
అమలాపురం రూరల్: కొత్తపేటలోని వీకేవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాల స్కిల్ హబ్‌లో త్వరలో ఆఫీస్ అసిస్టెంట్ ఉచిత శిక్షణ ప్రారంభిస్తున్నామని జి ల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు గురు వారం ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు ఉద్యోగం కల్పిస్తారన్నారు. ఆసక్తి ఉన్న వారు ఆ కళాశాలలో దరఖాస్తులు అందించాలని, వివరాలకు 90008 31156 మొబైల్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment