
24 వేసవి ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: వేసవి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తూర్పుగోదావరి జిల్లా మీదుగా ఈ నెల 11 నుంచి జూన్ 28వ తేదీ వరకు ప్రతి శుక్ర, శనివారాల్లో ప్రత్యేక రైళ్లు నడిపేందుకు చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు గురువారం ప్రకటించారు. చర్లపల్లి–శ్రీకాకుళం రోడ్డు(07025) రైలు ప్రతి శుక్రవారం, శ్రీకాకుళం రోడ్డు–చర్లపల్లి(07026) ప్రతి శనివారం అందుబాటులో ఉంటుందన్నారు. ఈ రైళ్లు జిల్లాలోని రాజమహేంద్రవరం, సామర్లకోట, అన్నవరం, తుని రైల్వే స్టేషన్లలో ఆగుతాయని చెప్పారు. అలాగే తిరుపతి–షిరిడీసాయి నగర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్ల(07637/38)ను జూన్ 30వ తేదీ వరకు పొడిగించినట్టు తెలిపారు.