
కోలాహలంగా ఎడ్ల పట్టు పందాలు
రాజానగరం: చక్రద్వారబంధం గ్రామంలో ఎడ్ల పట్టు పందాలు (ఎడ్లతో ఉన్న బండికి చక్రాలు తిరగకుండా తాళ్లతో కట్టి, వాటిపై బరువుతో కూడిన ఇసుక మూటలు పెట్టి జరిపే పందాలు) ఆదివారం కోలాహలంగా నిర్వహించారు. ముంగర తాతి, గంగరాత్నం జ్ఞాపకార్థం వారి కుమారుడు రాంబాబు ఆధ్వర్యాన స్థానిక రైసు మిల్లు లే అవుట్‌లో ఈ పందాలు జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి 17 జతల ఎడ్ల పాల్గొనగా, ఐదింటిని విజేతలుగా ఎంపిక చేసి, వాటి యజమానులకు షీల్డులు బహూకరించారు. మొదటి స్థానంలో మురమళ్ల రాంబాబు (మూలస్థానం), రెండో స్థానంలో పడాల రాంబాబు (బడుగువానిలంక), మూడో స్థానంలో వెలి శ్రీరామ్ (చింతల నామవరం), నాలుగో స్థానంలో ముంగర నాగేశ్వరరావు (చక్రద్వారబంధం), ఐదో స్థానంలో మిద్దే సురేష్ (మురమండ) నిలిచారు.