అతి వేగానికి యువకుడి బలి
దేవరపల్లి: అతివేగం ఒక యువకుడి ప్రాణం తీసింది. పోలీసుల కథనం ప్రకారం విజయవాడకు చెందిన కల్లూరి విజయ్‌కుమార్ (30), ఏలూరులోని వినాయకనగర్‌కు చెందిన ఏలేటి గోవింద్ వరుసకు బావ, బావమరుదులు. ఇద్దరూ కలసి గురువారం ఉదయం విశాఖపట్నంలో బంధువుల ఇంట జరుగుతున్న వివాహానికి బయలుదేరారు. విజయ్‌కుమార్ ద్విచక్ర వాహనం నడుపుతుండగా, గోవింద్ వెనుక కూర్చున్నాడు. దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్దకు వచ్చే సరికి హైవేపై ఆగి ఉన్న ఐషర్ వ్యాన్‌ను వెనుక నుంచి బలంగా ఢీ కొన్నారు. ఈ ఘటనలో విజయ్‌కుమార్ తలకు బలమైన గాయం కాగా చికిత్స కోసం 108 అంబులెన్స్‌లో కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. గోవింద్‌కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స అందిస్తున్నట్టు ఏఎస్‌ఐ నాగభూషణం తెలిపారు. విజయ్‌కుమార్ తల్లిదండ్రులు ఉదయం విశాఖపట్నం వెళ్లగా వెనుక ద్విచక్ర వాహనంపై వీరిద్దరు బయలు దేరారు. విజయ్‌కుమార్‌కు హెల్మెట్ ఉన్నప్పటికీ ధరించకపోవడం వల్ల మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ నుంచి
విశాఖ వెళ్తుండగా ఘటన
ఆగి ఉన్న వ్యాన్‌ను ఢీకొని
అక్కడికక్కడే మృతి
మరో వ్యక్తికి స్వల్ప గాయాలు
Comments
Please login to add a commentAdd a comment