క్లాస్–3, 4 ఉద్యోగులను నియమించాలి
రాజమహేంద్రవరం రూరల్: ఎల్‌ఐసీలో ఖాళీగా ఉన్న క్లాస్–3, క్లాస్–4 ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసీఈయూ) రాజమండ్రి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఆర్‌జే మాథ్యూస్, ఎం.కోదండరామ్ డిమాండ్ చేశారు. ఆలిండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐఐఈఏ) పిలుపు మేరకు మోరంపూడి సెంటర్‌లోని ఎల్‌ఐసీ డివిజనల్ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజనానికి ముందు ఒక గంట పాటు సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగులనుద్దేశించి కోదండరామ్, మాథ్యూస్ మాట్లాడుతూ, 2020 నోటిఫికేషన్‌లో భర్తీ కాకుండా మిగిలిన 2,700 క్లాస్–3, 4 ఉద్యోగ నియామకాలు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎల్‌ఐసీలో ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లపై యాజమాన్యంతో చర్చలు జరిపేందుకు ఏఐఐఐఈఏకి ట్రేడ్ యూనియన్‌గా వెంటనే గుర్తింపునివ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్.గన్నెయ్య, పీఎస్‌ఎన్ రాజు, జి.శ్రీనివాస్, సత్యదేవ, ఈశ్వరరావు, విశ్వనాథ్, మహిళా ఉద్యోగుల కన్వీనర్ శిరీష తదితరులు పాల్గొన్నారు.
వాట్సాప్‌తో తక్షణ పౌర సేవలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా తక్షణ పౌర సేవలు పొందవచ్చని కలెక్టర్ పి.ప్రశాంతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకృతి విపత్తులు, భారీ వర్షాల సమయంలో ప్రజలు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఈ నంబర్ ద్వారా వేగంగా చేరవేయవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం కూడా ఈ వాట్సాప్ నంబర్ ద్వారా చేరవేయనున్నారని తెలిపారు. అధికారులు తమ కార్యాలయాలు, పని చేసే ప్రదేశాల్లో ఈ వాట్సాప్ నంబర్ ప్రదర్శించాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగానికి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే ప్రజలు ఈ నంబరుకు మెసేజ్ పంపితే చాలన్నారు. అనంతరం వచ్చే రిఫరెన్స్ నంబర్ ద్వారా ఆ ఫిర్యాదు, వినతికి సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేయవచ్చన్నారు.
మూడు హోటళ్లపై కేసులు
అమలాపురం టౌన్: ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ఆహార నియంత్రణ అధికారి బి.శ్రీనివాస్, కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల ఆహార నియంత్రణ అధికారులు శ్రీకాంత్ చౌదరి, రుక్కయ్య, సుబ్బారావు తదితరులు అమలాపురంలోని పలు హోటళ్లపై గురువారం దాడులు చేశారు. ఒకసారి మరిగిన నూనెతోనే పదే పదే వంటకాల తయారీ, వంట గదుల్లో అపరిశుభ్రతను గుర్తించారు. సుబ్బారావు, బొండం బాబాయ్, విష్ణుశ్రీ, విజయదుర్గ, గ్రీన్ ట్రీ హోటళ్లతో పాటు గాయత్రి, గణపతి టిఫిన్స్, శ్రీదేవి బార్ అండ్ రెస్టారెంట్‌లకు నోటీసులు జారీ చేశారు.
క్లాస్–3, 4 ఉద్యోగులను నియమించాలి
Comments
Please login to add a commentAdd a comment