రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: రత్నగిరి సత్యదేవుని ఆలయం శుక్రవారం వేలాదిగా తరలివచ్చిన భక్తులతో కిటకిట లాడింది. రత్నగిరిపై గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వివాహాలు చేసుకున్న నవదంపతులు కూడా వారి బంధుమిత్రులతో కలసి సత్యదేవుని ఆలయానికి విచ్చేశారు. వీరంతా సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. దీంతో నవ దంపతులు, వారి బంధుమిత్రులు, పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులతో స్వామివారి ఆలయం, ఆలయ ప్రాంగణం, విశ్రాంతి మంటపాలు, క్యూ లు నిండిపోయాయి. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారు. సత్యదేవుని దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. అనంతరం రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి ప్రదక్షిణ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
తల్లి ప్రోత్సాహంతోనే ఐపీఎస్
ట్రైనీ అసిస్టెంట్ ఎస్పీ సుస్మిత
కాకినాడ రూరల్: తల్లి ప్రోత్సాహంతో తాను ఐపీఎస్‌గాను, సోదరిణి ఐఏఎస్‌గా ఎంపికయ్యామని 2023 ఏపీ కేడర్ ఐపీఎస్‌గా ఎంపికై న తమిళనాడుకు చెందిన ఆర్.సుస్మిత తెలిపారు. అసిస్టెంట్ ఎస్పీగా జిల్లాలో ట్రైనీలో ఉన్న ఆమె శుక్రవారం కాకినాడ రూరల్ సర్కిల్ పరిధిలోని తిమ్మాపురం స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌ఓ) బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తమిళనాడులోని కడలూరుకు చెందిన తమది వ్యవసాయ కుటుంబమన్నారు. తండ్రి వ్యవసాయం చేస్తారని, తల్లి ఎడ్యూకేషన్ డిపార్టుమెంట్‌లో నాన్ టీచింగ్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారన్నారు. తమ్ముడు చదువుకుంటున్నాడని, అక్కా, తాను ఐఏఎస్, ఐపీఎస్‌గా ఎంపికయ్యామన్నారు. తల్లి ప్రోత్సాహంతో తాను ఆరుసార్లు ప్రయత్నంతో ఐపీఎస్ సాధించానన్నారు. ఎస్‌హెచ్‌ఓగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు చదువు ఆవశ్యత తెలియజేయడంతో పాటు గుడ్, బ్యాడ్ టచ్, సైబర్ నేరాలు గురించి అవగాహన కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తానన్నారు. తిమ్మాపురం స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో పాటు గంజాయి నిర్మూలనపై దృష్టి పెడతామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు గాను ఆర్టీఐ నిబంధనలు పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేస్తామన్నారు. ముఖ్యంగా నంబరు ప్లేట్లపై దృష్టి పెడతామన్నారు. హెల్మెట్ ఆవశ్యకతను వివరిస్తామన్నారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
Comments
Please login to add a commentAdd a comment