పాఠశాలలో ఐఎఫ్‌పీ చోరీ
రామచంద్రపురం రూరల్: తాళ్లపొలం ఎంపీయూపీ పాఠశాల నుంచి రూ.లక్షకు పైగా విలువైన ఐఎఫ్‌పీ(ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్) చోరీకి గురైంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపర్చేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దీనిని సమకూర్చింది. పది రోజుల క్రితం ఈ ప్యానల్‌ను దొంగిలించేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. కటకటాల్లో టీవీ ఇరుక్కుపోవడంతో వదిలి వెళ్లిపోయారు. గతేడాది ఇదే పాఠశాలలో రెండు సిలిండర్లు చోరీకి గురయ్యాయి. అప్పట్లో ద్రాక్షారామ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. తాజాగా దొంగలు ఈ ప్యానల్‌ను అపహరించారు. హెచ్‌ఎం బొలిశెట్టి లక్ష్మణరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ తెలిపారు. అమలాపురం క్లూస్ టీం ఆధారాలు సేకరించింది.
Comments
Please login to add a commentAdd a comment