కంబాలచెరువు, (రాజమహేంద్రవరం): హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ న్యాయమూర్తి ఆర్.శ్రీలత తీర్పు చెప్పారు. 2021 సెప్టెంబర్ 25న జరిగిన ఈ కేసు వివరాలను స్థానిక మూడో పట్టణ పోలీసులు తెలిపారు. స్థానిక సీటీఆర్‌ఐ దుర్గానగర్ ప్రాంతానికి చెందిన జీరీ వెంకట తోటయ్యరెడ్డిని పాత గొడవల నేపథ్యంలో అదే ప్రాంతానికి చెందిన రౌడీ షీటర్ యర్రా సాయి కత్తితో విచక్షణా రహితంగా పొడిచి హత్య చేశాడు. అప్పటి మూడో పట్టణ ఇన్‌స్పెక్టర్ జి.మధుబాబు కేసు నమోదు చేశారు. వాదోపవాదాల అనంతరం యర్రా సాయి నేరం రుజువు కావడంతో అతడికి జీవిత ఖైదు, రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment