
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజ్డ్ క్రైమ్
క్రికెట్ బెట్టింగ్‌ను ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా డీఎస్పీ రఘువీర్ తెలిపారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో ఎక్కువగా యువత చిక్కుకుంటున్నారన్నారు. సోమేశ్వరంలో నిర్వహిస్తున్న క్రికెట్ బెట్టింగ్ మూలాలను పట్టుకుంటామన్నారు. విచారణ కొనసాగుతుందని చెప్పారు. అనుమానిత ప్రాంతాల్లో నిఘా పెంచుతామన్నారు. క్రికెట్ బెట్టింగ్‌లో పాల్గొని, డబ్బులు కోల్పోయిన వారు చెడు వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై దృష్టి సారించాలన్నారు. అలాగే ప్రజలు కూడా పోలీసులకు సహకారం అందించాలన్నారు. క్రికెట్ బెట్టింగ్, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఫ పోలీసుల అదుపులో ఆరుగురు
ఫ పరారీలో మరో నిందితుడు
రాయవరం: ఒకపక్క ఇండియా– న్యూజిలాండ్ వన్ డే క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా.. మరోపక్క ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వ్యక్తులను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారంతో పోలీసులు క్రికెట్ బెట్టింగ్ బ్యాచ్‌పై దాడి చేశారు. అయితే సోమేశ్వరంలో అదుపులోకి తీసుకున్న నిందితులు ఇచ్చిన సమాచారంతో రాజానగరం మండలం చక్రద్వారబంధం వెళ్లి అక్కడ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలను సోమవారం రాయవరం పోలీస్ స్టేషన్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ వెల్లడించారు.
ఆయన కథనం ప్రకారం.. సోమేశ్వరం గ్రామ వినాయక కాలనీలో లింగాపు సతీష్ ఇంట్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు వచ్చిన విశ్వసనీయ సమాచారంపై జిల్లా ఎస్పీ బి.కృష్ణారావు ఆదేశాలతో రామచంద్రపురం డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో మండపేట రూరల్ సీఐ పి.దొరరాజు, రాయవరం, మండపేట రూరల్ ఎస్సైలు డి.సురేష్‌బాబు, పి.బుజ్జిబాబులు దాడి చేశారు. ఆ సమయంలో ముగ్గురు ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తుండగా, ఒక వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకున్నాడు. ఇద్దరు నిందితులు ఇచ్చిన సమాచారంతో రాజానగరం మండలం చక్రద్వారబంధం గ్రామంలో గుట్టుగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ బెట్టింగ్ అంతా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నట్లు గమనించిన పోలీసులు వారి ఖాతాల్లో సోమవారం రూ.7.35 లక్షల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. భీమవరం, గొల్లప్రోలు, కొత్తపేట, సోమేశ్వరం గ్రామాలకు చెందిన పులి వెంకటేష్, గాడి గణేష్, అక్కిరెడ్డి వినయ్, నిమ్మకాయల రవి, కేతా నరేంద్ర, కేఏ రెడ్డిలను అదుపులోకి తీసుకుని వారు ఉపయోగించిన రెండు క్రికెట్ లైన్ బాక్సులు, నాలుగు ల్యాప్‌టాప్‌లు, 49 సెల్‌ఫోన్లు, ఒక సోనీ వాయిస్ రికార్డర్, ఒక ట్యాబ్, ఒక 32 అంగుళాల ఎల్‌ఈడీ టీవీ తదితర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment