చేబ్రోలు బైపాస్‌లో వ్యక్తి మృతదేహం
పిఠాపురం: కత్తిపూడి– పిఠాపురం రోడ్డులో చేబ్రోలు సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్లు సోమవారం ఎస్సై రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. చేబ్రోలు బైపాస్ రోడ్డు సమీపంలో సుమారు 40–50 ఏళ్ల వయస్సుగల వ్యక్తి మృతదేహం గుర్తించారు. దీనిని పిఠాపురం సీఐ శ్రీనివాస్ పరిశీలించి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై తెలిపారు.
బస్ బ్రేకులు ఫెయిల్
ఫ డ్రైవర్ సమయ స్ఫూర్తితో
పెళ్లి బృందానికి తప్పిన ప్రమాదం
ఫ రత్నగిరి ఘాట్ రోడ్‌లో ఘటన
అన్నవరం: సత్యదేవుని సన్నిఽధిలో జరిగిన వివాహానికి హాజరైన రాజమహేంద్రవరానికి చెందిన ఒక పెళ్లి బృందం బస్సుకు సోమవారం తెల్లవారు జామున రత్నగిరి ఘాట్ రోడ్‌లో త్రుటిలో ప్రమాదం తప్పింది. తెల్లవారు జామున సత్యగిరిపై జరిగిన వివాహానికి రాజమహేంద్రవరానికి చెందిన 40 మంది హాజరయ్యారు. అనంతరం వీరు తిరిగి పయనమయ్యారు. వారు ప్రయాణిస్తున్న బస్సు కొండ దిగువకు వస్తుండగా సత్యగిరి శివారు మలుపులో బస్సు బ్రేక్‌లు పట్టేయడంతో డ్రైవర్ విజయ్ అప్రమత్తమయ్యారు. బస్సును రోడ్డుకు ఎడమ వైపునకు మళ్లించి అక్కడి చెట్టుకు ఢీకొట్టారు. దీంతో బస్సు ఆ చెట్టును, దాని పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఆగిపోయింది. ఆ బస్సులో వారంతా ఆందోళన చెంది బస్సు డోర్ తీసుకుని కిందకు దిగిపోయారు. ఎవరికీ ఏవిధమైన గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా బస్సు రోడ్డుకు కుడివైపున ఉన్న లోయలో పడిపోయేది. బస్సులో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యేవి. డ్రైవర్ విజయ్ సమయ స్ఫూర్తితో చెట్టును ఢీకొనడంతో తామంతా సురక్షితంగా బయట పడ్డామని పెళ్లి బృందం తెలిపింది.
చేబ్రోలు బైపాస్‌లో వ్యక్తి మృతదేహం
Comments
Please login to add a commentAdd a comment