లక్కు కిక్కు ఎవరికో!
రాజమహేంద్రవరం రూరల్: ప్రభుత్వం గీత కులాలకు జిల్లాలో కేటాయించిన 13 మద్యం దుకాణాలకు లైసెన్సుల జారీకి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. ఈ ఏడాది జనవరి 27వ తేదీన ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమై గత నెల 8వ తేదీన ముగిసింది. గీత కులాలకు రిజర్వేషన్ ప్రాతిపదికన 2024–26 సంవత్సరాలకు మద్యం దుకాణాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గెజిట్ విడుదల ప్రకారం గతనెల 6వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి కావాల్సినప్పటికీ అశావహుల నుంచి స్పందన లభించలేదు. ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం మళ్లీ గడువు పెంచడంతో ఊహించనిదాని కంటే దరఖాస్తులు రికార్డు స్థాయిలో అధికంగానే 387 వచ్చాయి. నిడదవోలు రూరల్, సీతానగరం, గోపాలపురం, చాగల్లు మండలాల్లోని మద్యం షాపులకు పెద్దమొత్తంలో దరఖాస్తులు దాఖలయ్యాయి.
దరఖాస్తుల రూపంలో
రూ.7.74 కోట్ల ఆదాయం
జిల్లాలో 387 దరఖాస్తులు రూపంలో రూ.7.74 కోట్లు ఆదాయం సమకూరింది. నిడదవోలు రూరల్ మండలానికి అత్యధికంగా 48 దరఖాస్తులు రాగా, గోపాలపురం, సీతానగరం, చాగల్లు మండలాలకు 43 దరఖాస్తులు వచ్చాయి.
నేడు లక్కీడిప్
జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి సీహెచ్ లావణ్య నేతృత్వంలో అధికారులు గత నెల 9వ తేదీన దరఖాస్తులను పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మద్యం షాపుల లాటరీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగియడంతో గురువారం లాటరీ పద్ధతిలో రిజర్వేషన్లు వారీగా దుకాణాలను కేటాయించనున్నారు. ఇందుకు సంబంధించి రాజమహేంద్రవరం ఆర్‌డీవో కార్యాలయం సమావేశ మందిరంలో ఉదయం 10.00 గంటలకు కలెక్టర్ సమక్షంలో లక్కీడిప్ నిర్వహించనున్నారు. ఉదయం 8.00 నుంచి 9.00 గంటలలోపు దరఖాస్తుదారులు ఎంట్రీపాస్‌తో పాటు గుర్తింపుకార్డుతో లక్కీడిప్ నిర్వహణ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది అక్టోబరులో ఓపెన్ కేటగిరీ కింద జిల్లాలో 124 మద్యం దుకాణాలు కేటాయించారు. అందులో 10శాతం దుకాణాలు గీత కులాలకు వారి జనాభా, షాపుల నిష్పత్తి ప్రకారం జిల్లాలో మరో 13 దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.
జిల్లాలో మద్యం దుకాణాలు రిజర్వేషన్ల వివరాలు
మద్యం దుకాణం సామాజిక వచ్చిన
ప్రతిపాదించిన ప్రాంతం వర్గం దరఖాస్తులు
రాజమహేంద్రవరంసిటీ శెట్టిబలిజ 22
కడియం శెట్టిబలిజ 22
కోరుకొండ శెట్టిబలిజ 26
సీతానగరం శెట్టిబలిజ 43
రంగంపేట శెట్టిబలిజ 13
అనపర్తి గౌడ 09
బిక్కవోలు శెట్టిబలిజ 14
చాగల్లు శెట్టిబలిజ 43
తాళ్లపూడి శెట్టిబలిజ 26
దేవరపల్లి శెట్టిబలిజ 39
గోపాలపురం శెట్టిబలిజ 43
నిడదవోలురూరల్ గౌడ 48
పెరవలి శెట్టిబలిజ 39
ముగిసిన గీత కులాల మద్యం
దుకాణాల దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో 13 షాపులకు
387 దరఖాస్తులు
నేడు లక్కీడిప్ ద్వారా కేటాయింపు
Comments
Please login to add a commentAdd a comment