
వాడపల్లి వెంకన్నకు భక్తుల తాకిడి
కొత్తపేట: కోనసీమ తిరుపతిగా ఖ్యాతి కెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. గోవింద నామ స్మరణతో ఆలయం మార్మోగింది. ఉదయం స్వామివారిని ప్రత్యేకంగా పువ్వులతో అలంకరించారు. గౌతమీ గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఆవరణలోని వేంకటేశ్వరస్వామి క్షేత్ర పాలకుడు అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించారు. దేవదాయ ధర్మదాయశాఖ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment