
పదోన్నతులు కల్పించాక రేషనలైజేషన్
జిల్లా వీఆర్వోల సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్
రాజమహేంద్రవరం రూరల్: వీఆర్‌వోలకు పదోన్నతులు కల్పించిన తరువాతే రేషనలైజేషన్ చేపట్టాలని జిల్లా గ్రామరెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు సాన శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం పిడింగొయ్యి గ్రామ సచివాలయం–4లో జిల్లా గ్రామరెవెన్యూ అధికారుల సంఘం జిల్లా సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న రేషనలైజేషన్ ప్రక్రియతో రాష్ట్రవ్యాప్తంగా 7,500 సిబ్బంది తగ్గిపోతారన్నారు. మిగిలిపోయిన 7,500 వీఆర్‌వోలను ఏమి చేస్తారో ప్రభుత్వం ముందుగా స్పష్టత ఇవ్వాలన్నారు. ఇప్పటికే వీఆర్‌వోలు ఆనేక ఇబ్బందులకు గురవడంతో పాటు ఇతర శాఖల సర్వేలతో రెవెన్యూసేవలు ఆలస్యమవుతున్నాయన్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న వీఆర్‌వోలందరికి డీడీవోగా తహసీల్దార్లు ఉండేలా నిర్ణయం తీసుకుని అందరినీ రెవెన్యూ లైన్ డిపార్ట్‌మెంట్‌లో కొనసాగించాలన్నారు. కొవ్వూరు, రాజమండ్రి డివిజన్‌ల అధ్యక్షులు, మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment