గరుడ వాహనంపై ఘనంగా గ్రామోత్సవం
మధురపూడి: కోరుకొండ శ్రీలక్ష్మీనృసింహుని వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారు మంగళవారం రాత్రి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగసుందరంగా అలంకరించిన గరుడ వాహనంపై కోరుకొండ వీధుల్లో స్వామివారి గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామివారికి ఉదయం, సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. కల్యాణోత్సవాల సందర్భంగా స్వామివారి దర్శనాలు, లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా దేవస్థానానికి రూ.4,89,174 ఆదాయం వచ్చిందని అన్నవరం దేవస్థానం సూపరింటెండెంట్ వాసు తెలిపారు. అన్నప్రసాద విరాళాలుగా రూ.30,025 వచ్చాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment