ప్లాస్టిక్ గోడౌన్‌లో అగ్నిప్రమాదం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక పాత సోమాలమ్మ గుడి వద్ద ప్లాస్టిక్ గోడౌన్‌లో మంగళవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాలివీ.. ఆలయం ఎదురుగా హర్షిత ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన గోడౌన్ ఉంది. అందులో మార్కెట్‌లో విక్రయించేందుకు ప్లాస్టిక్ సామాన్లు పెద్ద మొత్తంలో ఉంచారు. ప్రస్తుతం సోమాలమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో వెలిగించిన బాణసంచా వెళ్లి పడటంతో ప్లాస్టిక్ గోడౌన్‌కు నిప్పంటుకుంది. ప్లాస్టిక్ సామగ్రి కావడంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రాజమహేంద్రవరం అగ్నిమాపకశాఖాధికారి శ్రీనివాస్ నేతృత్వంలో రాజమహేంద్రవరం నుంచి రెండు, కొవ్వూరు నుంచి ఒకటి చొప్పున అగ్నిమాపక వాహనాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటలకు పైగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. కాలి బూడిదైన ప్లాస్టిక్ సామగ్రి విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని గోడౌన్ యజమానులు చెబుతున్నారు.
రూ.30 లక్షల ఆస్తినష్టం
Comments
Please login to add a commentAdd a comment