నన్నయ వీసీకి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీకి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు లభించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన హెచ్‌ఎంటీవీ మాతృశక్తి అవార్డు–2025 కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డు అందుకున్నారు. అంతరించిపోతున్న 19 గిరిజన భాషలకు లిపి రూపొందించి, 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి ‘నారీ శక్తి’ అవార్డు అందుకున్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో వీసీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న తొలి గిరిజన మహిళగా గుర్తింపు పొందిన ఆమె విద్యారంగానికి అందిస్తున్న విశిష్ట సేవలకుగాను ఈ అవార్డు అందజేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నుంచి
అవార్డు అందుకుంటున్న ఆచార్య ప్రసన్నశ్రీ
Comments
Please login to add a commentAdd a comment