‘నన్నయ’ వీసీకి ‘శక్తి ప్రేరణ సమ్మాన్’ అవార్డు
రాజానగరం: గిరిజనుల భాష పరిరక్షణకు తన వంతు కృష్టి చేస్తూ, అణగారిపోతున్న 19 గిరిజన భాషలకు లిపిని అందించి, జీవం పోసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీ వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీకి ‘శక్తి ప్రేరణ సమ్మాన్’ అవార్డు లభించింది. జాతీయ మహిళా స్వచ్చంద సంస్థ, ఆంధ్ర విభాగం ‘ఆంధ్ర శక్తి’ 22వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆ సంస్థ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ వనపల్లి పద్మావతి, సభ్యులు ఈ అవార్డును వీసీకి అందజేశారు. కార్యక్రమంలో ఆచార్య పి.ఉమామహేశ్వరీదేవి, డాక్టర్ ఎన్.సజనరాజ్ పాల్గొన్నారు.
అమ్మ పాట రాసిన విద్యార్థిని అభినందించిన వీసీ
అమ్మ ప్రేమను వర్ణిస్తూ తాను రాసిన పాటను ఆలపించి, అందరినీ ఆకట్టుకున్న ఎంఏ ఎకనామిక్స్ విద్యార్థిని జి. రాణిశ్రీని వీసీ ఆచార్య ప్రసన్నశ్రీ అభినందించారు. ఆ పాటను తనకే అంకితమివ్వడంపై వీసీ స్పందిస్తూ, నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నీవు అమ్మా, నాన్నల ఆకాంక్షను నెరవేర్చే దిశగా ఎదగాలని సూచించారు. సాహిత్యంపై ఆ విద్యార్థినికున్న అభిలాషను ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment