
మహిళపై టీడీపీ మాజీ కౌన్సిలర్ దాడి
అమలాపురం టౌన్: తమ ఇంట్లో అద్దెకుంటున్న వ్యక్తిపై గొడవకు వచ్చిన అమలాపురానికి చెందిన టీడీపీ మాజీ కౌన్సిలర్ దున్నాల దుర్గ, అతని అనుచరులు తనపై ఇనుప రాడ్లతో దాడి చేసి, గాయపరిచారని స్థానిక నల్లవంతెన రజకపేటకు చెందిన టేకి వెంకటలక్ష్మి డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో గురువారం దీనిపై ఆమె ఫిర్యాదు చేయడమే కాకుండా, తనకు దున్నాల దుర్గ నుంచి రక్షణ కల్పించాలని డీఎస్పీని కోరారు. ఈ నెల 3న రాత్రి పది గంటల ప్రాంతంలో తన ఇంట్లో అద్దెకుంటున్న తోలేటి ఓంప్రకాష్ ఎక్కడ అంటూ తనపై దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని, రాజకీయ పలుకుబడితో మాజీ కౌన్సిలర్‌ను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వివరించారు. తనపై దాడి చేసిన దున్నాల దుర్గతో పాటు, దున్నాల దిలీప్, కంచిపల్లి శ్రీను, జక్కపు ప్రసాద్, ఏలూరి అయ్యప్పపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదులో కోరారు. ఆమెకు సంఘీభావాన్ని తెలిపిన వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొంతు రమణతో కలిసి బాధితురాలు డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
రక్షణ కల్పించాలని
డీఎస్పీకి బాధితురాలి ఫిర్యాదు