
చంద్రబాబు చెబుతున్నవన్నీ అబద్ధాలే
రాజమహేంద్రవరం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సందర్భాలు చంద్రబాబు చరిత్రలో ఏనాడూ లేవని విమర్శించారు. మహిళలకు ఉచిత సిలిండర్లు ఇవ్వక ముందే గ్యాస్ ధరలు పెంచేశారన్నారు. పెరిగిన గ్యాస్ ధరను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతను చంద్రబాబు గాలికి వదిలేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఐ–టీడీఈపీ నాయకులు అనైతిక వ్యాఖ్యలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. గతంలో ఇదే పరిస్థితి ఎదురైనప్పుడు చంద్రబాబు ఏడ్చారని.. ఇప్పుడేం మాట్లాడతారో చెప్పాలని వేణు డిమాండ్ చేశారు.